Header Banner
Header Banner
TRENDING NOW

మహేష్ కోసం విజయశాంతి ఒప్పుకుంటుందా..?

మహేష్ కోసం విజయశాంతి ఒప్పుకుంటుందా..?

హైదరాబాద్, 12 మార్చ్:

ఒకప్పటి స్టార్ హీరోయిన్ విజయశాంతి సినిమాలకి దూరమై చాలా కాలం అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆమెను సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రంతోనే రీ-ఎంట్రీ ఇప్పించాలని దర్శకుడు అనీల్ రావిపూడి ఎదురు చూస్తున్నట్టు సమాచారం.

ప్రస్తుతం మహేష్ బాబు తన 25వ చిత్రం ‘మహర్షి’ షూటింగు లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆఖరి దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రానుంది.

GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,
Life Homepathy
treefurn AD

ఇదిలా ఉండగా మహేష్ 26 వ చిత్రానికి సంబంధించిన పనులను అనీల్ రావిపూడి ఇప్పటికే ప్రారంభించారు. అందులో భాగంగానే ఓ కీలకమైన పాత్ర కోసం విజయశాంతిని సంప్రదించినట్టు సమాచారం. అయితే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా లేదా అనే విషయం మాత్రం స్పష్టంగా తెలియదు.

మరో కీలక పాత్ర కోసం కన్నడ హీరో ఉపేంద్రని సంప్రదించగా తనకి డేట్స్ లేని కారణంగా ఈ సినిమా చేయలేనని చెప్పినట్టు స్వయంగా ఉపేంద్రనే చెప్పాడు. 

ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో విజయశాంతి ఒప్పుకుంటుందా లేదా అనే విషయం తేలాల్సి ఉంది. 

మామాట: రాములమ్మ సినిమాలో రీ ఎంట్రీ ఉంటుందా 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: