అవినీతికే కేసీఆర్ ‘ఆర్ఆర్ఆర్’….

Share Icons:

హైదరాబాద్, 11 ఫిబ్రవరి:

తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి సరికొత్త ఆరోపణలతో కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. త్వరలో కేసీఆర్ ప్రభుత్వం కొత్త అవినీతికి తెరలేపుతుందని ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు.

అది కూడా రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంతో పొలుస్తూ విమర్శలు చేశారు. ఆ ట్వీట్స్ ఏంటంటే..

‘‘ రాజమౌళి దర్శకత్వం వహించే ఆర్‌ఆర్‌ఆర్ చిత్రానికి వచ్చే కలెక్షన్లను అధిగమించే విధంగా కేసీఆర్ గారు కొత్త ఆర్‌ఆర్‌ఆర్ ప్రాజెక్టుకి శ్రీకారం చేట్టారని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ కేసీఆర్ గారి ఆర్‌ఆర్‌ఆర్ ఏమిటంటే రీజనల్ రింగ్ రోడ్’’ అంటూ విజయశాంతి ట్వీట్ చేశారు.

ఇక మరో ట్వీట్‌లో ‘‘ ఈ ఆర్‌ఆర్‌ఆర్‌కు తెలంగాణ కేబినెట్ విస్తరణలో జరిగే ఆలస్యానికి లింక్ ఉందని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కేసీఆర్ గారి కేబినెట్ లో చేరడమంటే మంత్రులుగా ప్రమాణం చేసేవారు కొంత రిస్క్ చేయక తప్పదు మరి’’ అని పేర్కొన్నారు.

“అసలు కేసీఆర్ గారి కేబినెట్‌లో చేరబోయే వారికి విధించబోయే షరతులు ఏమిటంటే… తెరాస ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్ పేరుతో చేయబోతున్న లక్ష కోట్ల కుంభకోణానికి, మంత్రులు ఆమోదముద్ర వేయడంతో పాటు దానికి పూర్తి భాద్యత వహించాలి. రేపు ఏమైనా చట్టపరమైన ఇబ్బందులు వస్తే మంత్రులే భరించాలి. దీనికి సిద్ధపడిన వాళ్లు మాత్రమే మంత్రులుగా ప్రమాణం చెయ్యాలని కేసీఆర్ గారు మెలిక పెట్టారట.

ఈ షరతులకు అంగీకరించని హరీశ్ రావు గారి లాంటి సీనియర్ నేతలను పక్కన పెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ గారి కేబినెట్లో మంత్రులను రబ్బర్ స్టాంప్‌లా వాడుకుంటారని తెలుసు కానీ… ప్రభుత్వం చేసే అవినీతికి ఏజెంట్లుగా మార్చాలనుకోవడం దారుణం” అంటూ.. విజయశాంతి వరుస ట్వీట్లు చేసి తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపారు.

మామాట: మరి దీనికి టీఆర్ఎస్ కౌంటర్ ఏం ఇస్తుందో చూడాలి

 

Leave a Reply