విజయశాంతితో సహ బీజేపీలోకి వెళ్లనున్న మాజీ డిప్యూటీ సీఎం,మాజీ ఎంపీలు?

ap and telangana bjp leaders sensational comments
Share Icons:

హైదరాబాద్:

 

ఆపరేషన్ కమలం పేరుతో దూసుకుపోతున్న బీజేపీలో తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు పావులు కదుపుతోంది. ఇప్పటికే పలువురు నాయకులని పార్టీలో చేర్చుకున్న బీజేపీ…కాంగ్రెస్‌, టీడీపీ, టీఆర్‌ఎ్‌సకు చెందిన కొంతమంది ముఖ్యనేతలతో కమలం పార్టీ నాయకత్వం అంతర్గత మంతనాలు సాగిస్తోంది.

 

ఈ నేపథ్యంలో మాజీ ఉపముఖ్యమంత్రి ఒకరు, టీపీసీసీ ప్రచారకమిటీ చైర్‌పర్సన్‌ విజయశాంతితోపాటు పలువురు మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా కమలం గూటికి చేరనున్నారని తెలుస్తోంది.  బీజేపీ జాతీయ, రాష్ట్రపార్టీ ముఖ్యనేతలు స్వయంగా ఆయా పార్టీలకు చెందిన ప్రముఖులతో అంతర్గత చర్చలు కొనసాగిస్తున్నారు. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, టీడీపీలకు చెందిన మొత్తం ముగ్గురు మాజీ ఎంపీలు, 8 మంది మాజీ ఎమ్మెల్యేలు, మరో మాజీ డిప్యూటీ సీఎంతో పార్టీ నాయకత్వం టచ్‌లో ఉందని తెలుస్తోంది.

 

ఇప్పటికే చేరడానికి సన్నద్ధమైన నేతలతోపాటు టీడీపీ, కాంగ్రెస్‌, టీఆర్‌ఎ్‌సకు చెందిన మరికొంత మంది ముఖ్యులతో బీజేపీ నేతలు చర్చిస్తున్నారు. కాగా, నారాయణఖేడ్‌ మాజీ ఎమ్మెల్యే విజయ్‌పాల్‌రెడ్డి మంగళవారం ఉదయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ను కలుసుకున్నారు. పార్టీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు. ఆయన నిర్ణయాన్ని లక్ష్మణ్‌ స్వాగతించారు. 18న పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా హైదరాబాద్‌ వస్తున్నారని, అదే సందర్భంలో పార్టీలో చేరాలని కోరినట్లు లక్ష్మణ్‌ తెలిపారు. ఇక టీడీపీ ఎంపీ గరికిపాటి నరసింహరావుతో పాటు కొందరు టీడీపీ నేతలు కూడా అదే రోజు బీజేపీ తీర్ధం పుచ్చుకొనున్నారు.

 

Leave a Reply