మీరు ఫాంహౌజ్‌‌లో ఉన్నారు…మరి హైదరాబాద్ ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి….

Share Icons:

హైదరాబాద్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ప్రభావం తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో… ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి మండిపడ్డారు.

జిల్లాల్లో కరోనా ప్రభావం లేదని చెప్పిన ముఖ్యమంత్రి ప్రగతి భవన్ నుంచి తప్పించుకుని గజ్వేల్ ఫాంహౌజ్‌‌లో సేద తీరుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్ లోని ప్రజలు ఎక్కడికి వెళ్లాలో కేసీఆర్ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ‘‘తెలంగాణలో రోజుకొకటిగా కరోనా కేసుల పెరుగుదల నమోదు ప్రకటించబడుతూ ఉంది. హైదరాబాదులో ఈ సమస్య ఉంటుందని, జిల్లాల్లో అంతగా ఉండదని.. ప్రకటించిన సీఎం, తమ భద్రత దృష్ట్యా రాజధానిలోని తమ అధికార నివాసం ప్రగతి భవన్ నుంచి తప్పించుకుని గజ్వేల్ దగ్గర ఫాంహౌస్‌లో ఉంటున్నట్టుగా ప్రజలు అనుకుంటున్నారు.

మరి రాజధానిలోని సామాన్యులు ఎక్కడికి వెళ్లి తమ ప్రాణాలు రక్షించుకోవాలో కెసిఆర్ చెబితే బాగుంటుంది. ముఖ్యమంత్రి వెంటనే రాజధానికి వచ్చి, అధికార యంత్రాంగానికి అందుబాటులో ఉంటూ.. ప్రభుత్వ చర్యలను నేరుగా పర్యవేక్షించాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు’’ అని రాసుకొచ్చారు.

ఇదిలా ఉంటే కరోనావైరస్‌ను ఆషామాషీగా తీసుకోవద్దని, ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నా.. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు తెలంగాణ గడ్డపై ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదని, ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు. స్కాట్లాండ్ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చిందని, దీంతో రాష్ట్రంలో మొత్తంగా నమోదైన పాజటివ్ కేసుల సంఖ్య 6కు చేరిందని చెప్పారు. కరోనాపై పోరులో ఎక్కడా రాజీ పడవద్దని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారని మంత్రి తెలిపారు.

 

Leave a Reply