టీడీపీతో పొత్తు వద్దంటున్న రాములమ్మ…

vijayasanti oppose tdp and congress align
Share Icons:

మెదక్, 25 ఆగష్టు:

రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నాయని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ విషయాన్ని కొందరు కాంగ్రెస్, టీడీపీ నేతలు బహిరంగంగానే చెబుతూ వస్తున్నారు. అయితే ఈ పొత్తుని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి మాత్రం పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.  ఈ మేరకు ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేఖ రాయాలని ఆమె అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

టీడీపీతో పొత్తు పెట్టుకుంటే భారీగా నష్టపోతామని,  రాష్ట్ర విభజన తర్వాత చాలా సమస్యలు పరిష్కారం కాకపోవడానికి చంద్రబాబు కారణమని ఆమె భావిస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ పరిస్థితుల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుంటే నష్టపోతామని విజయశాంతి మెదక్ జిల్లా కాంగ్రెస్ నేతల వద్ద ఆవేదన వ్యక్తం చేశారని అంటున్నారు.

చావో రేవో తేల్చుకోవాల్సిన స్థితిలో కొందరు పార్టీ నేతలు కాంగ్రెస్ అధిష్టానాన్ని తప్పుదోవపట్టిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో తీవ్రంగా నష్టపోతామని ఆమె అన్నట్లు చెబుతున్నారు. కేవలం హైదరాబాద్‌లో కొన్ని సీట్లు గెలుస్తామనే ఉద్దేశంతో ఉన్న కొందరు కాంగ్రెస్ నేతలు టీడీపీతో పొత్తు కోసం తహతహలాడుతున్నారని ఆమె అన్నట్లు తెలుస్తోంది.

మామాట: మరి రాములమ్మ మాట అధిష్టానం వింటుందా?

Leave a Reply