చంద్రబాబు కట్టిన భవనాలకు జగన్ రిబ్బన్ కటింగ్… సిగ్గుగా లేదా సాయి

tdp mlc budda venkanna fires on vijayasaireddy
Share Icons:

అమరావతి: ప్రతిరోజూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలు ట్విట్టర్లో విమర్శలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇక రోజు మాదిరిగానే ఈరోజు కూడా వీరి విమర్శలు ట్విట్టర్‌లోకి వచ్చాయి. ప్రతిపక్ష నేతగా 9 నెలల్లో చేసిందేమిటంటే… ఇసుక మాఫియాను రక్షించేందుకు ఇస్కో… ఉస్కో అంటూ శివాలూగాడు. అవినీతి అధికారులకు కాపలాదారయ్యాడు. పొర్లు దండాలతో బొంగరంలా తిరగడమే మిగిలింది’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన విమర్శలకు టీడీపీ నేత బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు.

‘చంద్రబాబు గారు చేసిన అభివృద్ధికి పార్టీ రంగులు వేసుకోవడానికే మీకు 9 నెలలు సరిపోలేదు. చంద్రబాబు గారు కట్టిన భవనాలకు మళ్లీ జగన్ గారితో రిబ్బన్ కటింగ్ చేయించడం సిగ్గుగా లేదా సాయి రెడ్డి గారు?’ అని ట్వీట్ చేశారు. ‘9 నెలల కాలంలో ముఖ్యమంత్రిగా జగన్ రాయలసీమకి, ఉత్తరాంధ్రకి, రాష్ట్రానికి ఏం చేశారో చర్చకు నేను సిద్ధం. ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేసింది లేదు’ అని బుద్ధా వెంకన్న విమర్శించారు .

‘గ్రీన్ ఛాలెంజ్ అని రెండు మొక్కలు నాటి పారిపోతే ఎలా విజయసాయిరెడ్డి గారూ? బుద్ధా ఛాలెంజ్ స్వీకరించండి. మూడు ముక్కల రాజధాని అంటున్నారు, రాష్ట్ర అభివృద్ధిని ప్రతిపక్షం అడ్డుకుంటుంది అని ముసలి కన్నీరు కారుస్తున్నారు’ అని విమర్శలు గుప్పించారు. ‘సొంత పార్టీ కార్యకర్తనే ఆదుకోని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గారు మూడు రాజధానులు నిర్మిస్తానని అనడం విచిత్రంగా ఉంది. ఆయన మాటలు వైకాపా  పార్టీ కార్యకర్తలే నమ్మే పరిస్థితి లేదు’ అంటూ టీడీపీ నేత నారా లోకేశ్ ఓ వీడియోను పోస్ట్ చేశారు.

అందులో వైసీపీ పోస్టర్లను చించేసిన ఆ పార్టీ కార్యకర్త పలు విషయాలు తెలిపాడు. ‘మూడు రాజధానులకు మద్దతుగా నేను ర్యాలీకి వెళ్లాను. నాకు యాక్సిడెంట్ జరిగింది. నా కాలు విరిగింది.. వైసీపీ నేతలు ఎవరూ ఆదుకోవట్లేదు. ఇలాంటి వారని తెలియక నేను వారికి మద్దతు తెలిపాను. నా చెప్పుతో నేను కొట్టుకోవాలి’ అని ఆయన చెప్పాడు.

 

Leave a Reply