పొద్దున్నే మొదలు: విజయసాయి వర్సెస్ బుద్దా

tdp former mla ready join to ysrcp
Share Icons:

అమరావతి: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలు రోజూ ట్విట్టర్‌లో విమర్శలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇక రోజూ మాదిరిగానే ఈరోజు ఉదయం కూడా ఇద్దరు నేతలు ట్విట్టర్ లోకి వచ్చేశారు. ఓ తెలుగు మీడియా అధినేతపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సీఎంగా లేని ఏపీ నాశనమైపోవాలని కిరసనాయిలు కోరుకుంటున్నాడని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీతో రాష్ట్ర సమస్యలపై చర్చిస్తూ ముఖ్యమంత్రి జగన్ గంటన్నర సేపు సమావేశమయ్యారని…. అయితే, పీపీఏలపై జగన్ ను మోదీ మందలించారంటూ సైనైడ్ వార్తలను కుమ్మరించారని మండిపడ్డారు. జయము జయము చంద్రన్నా అనే భజన పరాకాష్ఠకు చేరిందని దుయ్యబట్టారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

విజయసాయిరెడ్డి చేసిన విమర్శలకు టీడీపీ నేత బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు.’జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రం నాశనం అవ్వాలని కోరుకుంటున్నాడు ఫినాయిల్. జగన్ గారి చెత్త ఆలోచనలతో రాష్ట్రం అన్ని రంగాల్లో అధఃపాతాళానికి పోతున్నా 9 నెలల జగ్లక్ పాలనలో రాష్ట్రం వెలిగిపోతుంది అంటూ బ్లాక్ పేపర్ లో వార్తలు రాయించుకొని సంబరపడుతున్నారు’ అని విమర్శించారు.

ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరొకసారి జగన్ ఫై సంచలన వ్యాఖ్యలు చేసారు. వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుని తీవ్రంగా దుయ్యబట్టారు. కియా పరిశ్రమకు వెళ్తున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారి కారుని పోలీసులు వెంబడించి మరి అరెస్ట్ చేయడం ఏమిటి అని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆయనేమైనా నేరస్తులా అంటూ ధ్వజమెత్తారు. అనంతపురంలో సిపిఐ నేతలు గృహ నిర్బంధాన్ని,అక్రమ అరెస్టులని ఖండిస్తున్నానని చంద్రబాబు అన్నారు.

‘తుగ్లక్ నిర్ణయాలతో రాష్ట్రానికే కాక దేశానికే నష్టం కలిగిస్తుంటే ప్రధాని మందలించక దండ వేసి దన్నం పెడతారా ఫినాయిల్ గారు? 9 నెలల్లో ఏమి సాధించారని ‘మోదీ గారు ప్రశంసలతో ముంచెత్తారు’ అని మీ బ్లాక్ పేపర్ లో రాయించారు? సిగ్గుగా లేదా??’ అని ప్రశ్నించారు.

 

Leave a Reply