తమ దేవుడు చంద్రబాబు అంతకంటే గొప్పవాడు..

ysrcp mp vijayasai reddy comments on balakrishna son in laws
Share Icons:

హైదరాబాద్: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన నేపథ్యంలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దీనిపై ట్విట్టర్ లో స్పందించారు. ఉగ్రవాద సంస్థలు వ్యవస్థలను విచ్ఛిన్నం చేసేందుకు కోవర్టులు, స్లీపర్ సెల్స్‌ను సమాజంలో ప్రవేశపెడతాయని, ప్రజా సంక్షేమం కోసం ఐకమత్యంగా పనిచేయాల్సిన చోట ఈ విధంగా ద్రోహులను చొప్పించడం, సమయం చూసి వారు విధ్వంసానికి దిగడం టెర్రర్ గ్రూపుల కంటే ఘోరం కాదా? అని ప్రశ్నించారు.

ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతోంది కూడా అదేనని, చంద్రబాబు సీఎంగా లేని రాష్ట్రంలో ప్రజలు ప్రశాంతంగా ఉండడానికి వీల్లేదని, వ్యవస్థలోకి ఆయన చొప్పించిన స్లీపర్ సెల్స్ కరాఖండీగా చెబుతున్నాయని విమర్శించారు. దేశం కంటే కులమే గొప్పదని, తమ దేవుడు చంద్రబాబు అంతకంటే గొప్పవాడని, ఆర్థిక సంఘం నిధులు రూ.5 వేల కోట్లు రాకపోతే మాకేంటి అని ఈ నిద్రాణ శక్తులు అంటున్నాయని మండిపడ్డారు.

అటు రాజకీయాలు కోసం ఎంతకైనా బరితెగించే వ్యక్తి చంద్రబాబు అని మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నికల సంఘం ఉన్నతాధికారులపై.. ఏం మాట్లాడారో చంద్రబాబు గుర్తుచేసుకోవాలని ధ్వజమెత్తారు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారిని కూడా అంతు చూస్తానని బెదిరించారన్నారు. చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలని.. అధికారంలో ఉన్నప్పుడు కళ్లు తలకెక్కి మాట్లాడిన చంద్రబాబు.. ఇప్పుడు సూక్తులు చెబుతున్నారని ఆయన నిప్పులు చెరిగారు.

చంద్రబాబు ప్రలోభాలకు లొంగినట్లుగా ఎన్నికల కమిషనర్‌ తీరు ఉందని విమర్శించారు. ఎన్నికలు వాయిదా వేస్తారని టీవీ5, ఆంధ్రజ్యోతి ముందే చెప్పామంటున్నాయి.. ఎవరికీ అంచనా లేని అంశం ఆ మీడియాకు ఎలా తెలిసిందని ప్రశ్నించారు. రాజ్యాంగానికి లోబడే ఎన్నికల కమిషనర్‌ ప్రవర్తించాలన్నారు. విచక్షణాధికారాన్ని ధర్మబద్ధంగా వాడనప్పుడు విలువ ఇవ్వరన్నారు.  వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షించకుండానే నిర్ణయం ఎలా తీసుకుంటారని నాని మండిపడ్డారు.

 

Leave a Reply