పవన్….ఎవరో చెబితే ఉస్కో అంటే మోరిగి వెళ్లిపోవడం కాదు….

ysrcp mp vijayasai reddy comments on balakrishna son in laws
Share Icons:

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  ఎన్నికల్లో ఘోర ఓటమి పాలయినప్పటికీ సిగ్గుపడకుండా దులిపేసుకున్నాడని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై విజయసాయి రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన అమ్ముడుపోయారంటూ ఆరోపణలు గుప్పించారు. ‘ఎలక్షన్లలో ప్రజలు పొర్లించి కొట్టినంత పనిచేసినా సిగ్గుపడకుండా దులిపేసుకున్నాడు. యాక్టరును చూద్దామని నలుగురూ పోగవగానే రెచ్చిపోయి డైలాగులు వదుల్తున్నాడు. రాజకీయాలంటే ప్యాకేజి కోసం అమ్ముడు పోవడం కాదు. ఎవరో ఉస్కో అంటే కాసేపు మొరిగి వెళ్లిపోవడం అంతకంటే కాదు’ అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.

అంతకముందు ‘నా కులం మాట తప్పని కులం’ అన్న ముఖ్యమంత్రి జగన్ పై జనసేనాని పవన్ కల్యాణ్ విమర్శల వర్షం కురిపించారు. ‘అసలు మతం మారాక కులం ఎక్కడి నుంచి వచ్చిందండీ జగన్ గారికి?’ అని ఆయన ప్రశ్నించారు. మతం మారాక మీకు కులమెందుకండీ… వదిలేయండి కులాన్ని అంటూ వ్యాఖ్యానించారు. నా మత విశ్వాసం ఇది, నా కులం ఇది అని జగన్ రెడ్డి మాట్లాడుతుంటారని… ఆయనకు ఒకటే చెప్పాలనుకుంటున్నానని… మతం మారాక కులాన్ని వదిలేయండి అని చెప్పారు. కులం కావాలి, మతం కావాలి, ఓట్లు కావాలి, డబ్బులు కావాలి, అన్నీ కావాలి అని ఎద్దేవా చేశారు. సమాజం మారింది, యువత మారింది… కానీ, రంగులే మారడం లేదని చెప్పారు. వైసీపీ అంటేనే రంగుల రాజ్యమని విమర్శించారు.

క్రిస్టియానిటీని అనుసరిస్తున్నవారికి కులం ఉండదని పవన్ కల్యాణ్ చెప్పారు. మతం మీద విశ్వాసం ఉన్నవారు చెట్టుకు కూడా హాని తలపెట్టరని… కానీ, జగన్ రెడ్డి చెట్లను నరికించేస్తారని అన్నారు. తిరుమలను గౌరవించాలని, అక్కడ అన్యమత ప్రచారం జరగకూడదని చెప్పారు. రాజ్యంగం స్వేచ్ఛ ఇచ్చింది కదా అని ఎలా పడితే అలా చేయకూడదని అన్నారు.

 

Leave a Reply