చంద్రబాబుని చూస్తే జాలేస్తుందంటున్న విజయసాయిరెడ్డి….

Share Icons:

హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. ఆయన చెబుతున్న మాటలకు ఎవ్వరూ చప్పట్లు కొట్టకపోవడంతో చప్పట్లు కొట్టాలంటూ అడుగుతున్నారని చురకలంటించారు.

‘గట్టిగా చప్పట్లు కొట్టి తనను ఉత్సాహపరచాలని 70 ఏళ్ల వయసులో ప్రాధేయపడుతుంటే జాలేస్తుంది.  కార్యకర్తలు మరీ స్పందన లేకుండా మారిపోతే ఎలా? అడిగినందుకైనా కాసేపు క్లాప్స్ కొట్టొచ్చుగదా. చివరకు స్లోగన్స్ ఇచ్చి అందరూ తనతోనే ఉన్నారని భ్రమపడి ఇంకో చోటుకి బయలుదేరుతున్నాడు’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

ఇక రాబోయే 30 ఏళ్లు జగనే సీఎంగా ఉంటారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఐదేళ్లలో రాష్ట్రంలో టీడీపీ లేకుండా చేస్తారన్నారు. చంద్రబాబువి తప్పుడు ఆలోచనలని..సానుభూతి కోసం అరెస్టు చేయమంటున్నారని మంత్రి పెద్దిరెడ్డి విమర్శించారు.

అటు ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘జగనన్న చేదోడు’ పథకం పేరుపై టీడీపీ నేత వర్ల రామయ్య సెటైర్లు వేశారు. ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి ఆయన ట్వీట్ చేస్తూ, ‘ముఖ్యమంత్రి గారు…  మీ ప్రభుత్వం తెలుగును ఖూనీ చేస్తుందా? లేక మిమ్ముల్ని అల్లరి చేస్తుందా?’ అని ప్రశ్నించారు. చేదోడు అంటే సహాయం అనే కాకుండా, చేదువాడు అనే అర్థం కూడా వస్తుందని చెప్పారు. “జగనన్న చేదువాడు” అంటే చెడ్డవాడు అనే అర్థం కూడా వస్తుందని ఎద్దేవా  చేశారు. ‘ఏమయ్యారు సార్, మీ తెలుగు ప్రపంచ మేధావులు? పేరు మార్చండి’ అని ట్వీట్ చేశారు.

 

Leave a Reply