అవినీతి సర్పాలపై ఐటీ సోదాలు: బాబు నోరు విప్పడం లేదు..

chandrababu sensational decision tdp arrange the Rehabilitation for the activists
Share Icons:

హైదరాబాద్: గత రెండు మూడు రోజులుగా టీడీపీకి సంబంధించిన నేతలతో పాటు చంద్రబాబు మాజీ పీఏపై ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబును ఉద్దేశించి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా సెటైర్లు వేశారు. ఐటీ సోదాలపై రెండు రోజులుగా కిక్కురుమనకుండా ఉన్నారని… కియా కంపెనీ లేచిపోతోందంటూ ఫేక్ వార్తలతో ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. మాజీ పీఏతో పాటు తాను పెంచి పోషించిన అవినీతి సర్పాలపై జరుగుతున్న ఐటీ సోదాలపై చంద్రబాబు నోరు విప్పడం లేదని ఆయన అన్నారు. నిప్పుకణికల్లాంటి వారిపై ఈ దాడులేంటని చంద్రబాబు ఇప్పటికే ఐటీ శాఖను నిలదీయాలని ఎద్దేవా చేశారు.

కర్నూలు అభివృద్ధికి సీఎం జగన్‌ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు.  శ్రీబాగ్‌ ఒప్పందంలో కర్నూలులో హైకోర్టు ఉండాలని ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. పవన్‌ కళ్యాణ్‌.. బాబుతో లాలూచీ పడి బీజేపీలో చేరాడని, ఈయన బాబు మేలు కోసమే పనిచేసే వ్యక్తి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బాబు దగ్గర పవన్‌ గుమస్తాగా పనిచేస్తున్నాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ నోట ఒకే మాట వస్తుంది.. మీ పాట్నర్‌ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? అని పవన్‌ను ప్రశ్నించారు.

ఇక ఐదేళ్లలో బాబు దుర్మార్గంగా దోచుకున్నందునే ఒక్క పరిశ్రమ కూడా రాలేదని, పైగా పరిశ్రమలకు సబ్సిడీ కూడా ఇవ్వలేదని,  టీడీపీ పాలనలో జన్మభూమి కమిటీలు అవినీతి ఊబిలో కూరుకుపోయాయని చెప్పారు. బాబు.. మా వర్గానికే, మా వాళ్లకే అభివృద్ధి ఫలాలు అందాలనేలా పాలన సాగించారని, కానీ, సీఎం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పాలన అందాలని వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థలు తీసుకువచ్చారని, దీనిద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు చేరవేస్తామని, గతంలో పెన్షన్లు 44 లక్షలు ఉంటే ఇప్పుడా సంఖ్య 54లక్షలకు చేరుకున్నాయని మంత్రి వెల్లంపల్లి పేర్కొన్నారు.

 

Leave a Reply