బాబు అడ్డంగా దొరికిపోయారన్న విజయసాయి…వెంటనే బుద్దా కౌంటర్…

tdp mlc budda venkanna fires on vijayasaireddy
Share Icons:

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం అమరావతిలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ‘రాజధాని అమరావతి పర్యటన’లో చోటు చేసుకున్న విషయాలను ఆయన ప్రస్తావిస్తూ ఆయనకు ఎవరి మీదా గౌరవం, అభిమానాలు ఉండవని అన్నారు. చంద్రబాబు అమరావతి పర్యటనకు సంబంధించి ఓ వీడియో వైరల్ అవుతోంది. దీనిపై విజయసాయిరెడ్డి స్పందించారు. ‘అమరావతి యాత్రలో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయాడు. అందరికీ టిఫిన్లు పెట్టారా? అని నిర్వాహకుడిని అడిగితే డబ్బులిచ్చాం అని బదులిచ్చాడు. అంతా పెయిడ్ ఆర్టిస్టులయ్యారని బాబు అనడం వీడియోలో క్లియర్‌గా కనిపిస్తోంది. ఆ వీడియో వైరల్ అయింది. బతుకంతా డబ్బుతో మేనేజ్ చేయడమే’ అని విజయసాయి రెడ్డి అన్నారు.

పార్టీ కార్యకర్తలంటే చంద్రబాబుకు ఎంత చులకనో ఇంకోసారి ఆ వీడియో సాక్షిగా బయటపడిందని విజయసాయి రెడ్డి అన్నారు. కార్యకర్తలకు డబ్బు, మద్యం అలవాటు చేసిందే ఆయనని విమర్శించారు. పెయిడ్ ఆర్టిస్టులుగా మారారని అధికారం కోల్పోయాక తల బాదుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు ఎవరి మీదా గౌరవం, అభిమానాలు ఉండవని ప్రేమ నటిస్తాడని చెప్పారు.

ఇక విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు టీడీపీ ఎమ్మెల్సీ వెంటనే కౌంటర్ ఇచ్చారు. ‘తెనాలి నుండి పెయిడ్ ఆర్టిస్టులను తెచ్చి, చెప్పులు వేయించి సాక్షి ఛానల్ లో అడ్డంగా దొరికిపోయాడు జగన్. ఆ వీడియో వైరల్ అవుతుంది. పాపం! విజయసాయి రెడ్డి గారు పార్లమెంట్ సమావేశాల్లో కాళ్లు పట్టుకొనే పనిలో బిజీగా ఉండి ఆ వీడియో చూడలేదనుకుంటా’ అని ట్వీట్ చేశారు. జగన్ బతుకంతా సాక్షి గ్రాఫిక్స్ తో మేనేజ్ చెయ్యడమేనని బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు. అదే పద్ధతిలో ఉన్న అమరావతిని గ్రాఫిక్స్ అంటూ భ్రమ కల్పించబోయి బొక్క బోర్లా పడ్డారని విమర్శించారు. పెయిడ్ ఆర్టిస్టులు స్వయంగా సాక్షిలోనే ‘తెనాలి నుండి తీసుకొచ్చారు’ అని చెప్పడంతో తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక జగన్ గారు ఇబ్బంది పడుతున్నారంటూ విమర్శలు గుప్పించారు.

 

Leave a Reply