కరకట్ట మీద ఇల్లు మునిగిపోవడం దేవుడు రాసిన అసలు స్క్రిప్ట్…

Share Icons:

అమరావతి:

 

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి సెటైర్లు వేశారు. అమరావతిని భ్రమరావతి అన్న ముఖ్యమంత్రి జగన్ చేతే దేవుడు అక్కడ లైటింగ్ పెట్టించాడనీ, దేవుడు భలే స్క్రిప్ట్ రాశాడని టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల విమర్శించిన సంగతి తెలిసిందే. తాజాగా చంద్రబాబు వ్యాఖ్యలకు వైసీపీ నేత విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు.

 

భ్రమరావతిలోని నాలుగు భవనాలకు స్వాతంత్ర్య దినోత్సవం రోజూ లైటింగ్ ఏర్పాటు చేస్తే ఇంతలా ఎందుకు మురిసిపోతున్నారని చంద్రబాబును ప్రశ్నించారు. ఈ లైటింగ్ అన్నది అసలు స్క్రిప్టే కాదనీ, కరకట్ట మీద నివాసం మునిగిపోవడం,  చంద్రబాబు హైదరాబాద్ కు పారిపోవడమే దేవుడు రాసిన అసలైన స్క్రిప్టని విజయసాయిరెడ్డి చురకలు అంటించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో స్పందించారు.

 

అటు వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత వర్ల రామయ్య ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఇంటి గురించి తాము చూసుకుంటామని, ముందు వరద బాధితుల గురించి ప్రభుత్వం పట్టించుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వం, మంత్రులు చంద్రబాబు ఇంటిని ఖాళీ చేయించడం మీద చూపిస్తున్న శ్రద్ధ వరద బాధితులను ఆదుకోవడంపై పెట్టడంలేదని వర్ల రామయ్య ఆరోపించారు. అయ్యా ఏపీ సీఎం, చంద్రబాబు నివాసం మీద నుంచి దృష్టి మరల్చి, రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాలపై దృష్టి పెట్టండి అంటూ ట్వీట్ చేశారు.

 

Leave a Reply