చంద్రబాబు…ఐదేళ్లు ఆయన్ని ఆంబోతులా జనం మీదకి వదిలారు

Share Icons:

అమరావతి:

 

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. పాలిచ్చే ఆవును కాదని దున్నపోతును ఏపీ ప్రజలు తెచ్చుకున్నారని చంద్రబాబు సందర్భోచితంగా చెప్పిన వ్యాఖ్యలపై వెటకారంగా స్పందించారు. పాలిచ్చే ఆవు(చంద్రబాబు), పాలు మరవని దూడ(లోకేశ్) కలిసి ఆ ‘కోడె’ల సంగతి చూడాలని విజయసాయిరెడ్డి సూచించారు.

 

ఆయన్ను చంద్రబాబు ఐదేళ్ల పాటు జనంపైకి ఆంబోతులా వదిలారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడెల గుంపు పొడిచి, తన్నని ప్రజలు మిగలలేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇకనైనా దొడ్లో కట్టేయాలనీ, లేదంటే తరిమివేయాలని అన్నారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందించారు.

 

ఇదిలా ఉంటే ఏపీలో ఏర్పాటు చేసే పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలని జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. మరోవైపు, జగన్ బాటలోనే కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర పయనిస్తున్నారు. కర్ణాటకలోని ఉద్యోగాలన్నీ కన్నడిగులకే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తన డిమాండ్ పై ఈ నెల 14, 15 తేదీల్లో నిరాహారదీక్షను చేపట్టనున్నట్టు తెలిపారు.

Leave a Reply