బాబు ఎమ్మెల్యేలతో రౌడీయిజం, ఇసుక దందా చేయిస్తున్నారు…

vijayasai reddy fires on cm chandrababu
Share Icons:

ఏలూరు, 10 అక్టోబర్:

పశ్చిమగోదావరి టీడీపీకి 15 అసెంబ్లీ సీట్లు ఇస్తే చంద్రబాబు ఆ ఎమ్మెల్యేలతో రౌడీయిజాన్ని, ఇసుక దందాని చేయిస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఈరోజు ఆయన ఏలూరులో  మీడియాతో మాట్లాడుతూ.. 2014లో డ్వాక్రా మహిళలతో చంద్రబాబు సన్మానం చేయించుకున్నారని, కానీ వారికి రుణమాఫి మాత్రం చేయలేకపోయారని అన్నారు.

ఇక నాలుగున్నరేళ్ళల్లో సుమారు రూ. 5 లక్షల కోట్లు విదేశాలకి తరలించారని, వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే చంద్రబాబు విదేశాలలో దాచుకున్న అక్రమార్జనను వెనక్కి రప్పిస్తామని తెలిపారు.

అయితే ఎన్నికల తర్వాత చంద్రబాబు, ఆయన తనయుడు విదేశాలకు పారిపోకుండా వారి పాస్ పోర్ట్‌లు సీజ్ చెయ్యాలని, రాష్ట్ర విభజనకి కారణం కాంగ్రెస్ అని, దానికి సహకరించిది టీడీపీ అని మండిపడ్డారు.

అసలు తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ కలయిక అనైతికమని, ఐటి సోదాలంటే చంద్రబాబు భయపడుతున్నారని, తప్పు చేయకపోతే ఐటి సోదాల సమయంలో పోలిసులను పంపకూడదని క్యాబినెట్‌లో ఎందుకు నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు. ఇక నాలుగున్నరేళ్ళు కేంద్రంతో జతకట్టి ఇపుడు సహకరించడంలేదంటూ చంద్రబాబు లేఖ రాస్తాననడం హస్యాస్పదమని విజయసాయి విమర్శించారు.

మామాట: అంతే అంటారు…

Leave a Reply