అమిత్ షాని చూస్తే బాబు వణికిపోతున్నారు…

Share Icons:

అమరావతి:

 

తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. టీడీపీ నేతలంతా పోలోమని బీజేపీలో చేరుతున్నా కిక్కురుమనలేని పరిస్థితి చంద్రబాబుదని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. బీజేపీ చీఫ్ అమిత్ షాకు కోపం వస్తుందేమోనని చంద్రబాబు వణికిపోతున్నారని వ్యాఖ్యానించారు.

 

అందుకే పార్టీ వదిలివెళుతున్న వారిని కనీసం నిలువరించే ప్రయత్నం కూడా చేయడం లేదని దుయ్యబట్టారు. అవినీతి కేసులు తిరగదొడుతారన్న భయంతోనే చంద్రబాబు సైలెంట్ అయిపోయినట్లు ఉన్నారని విమర్శించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందించారు.

 

అటు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో కావాలనే కృత్రిమ వరదలను ప్రభుత్వం సృష్టించిందని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ నేత, ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) టీడీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు గారు స్థాపించింది పాల ఫ్యాక్టరీనా? లేక పప్పుల ఫ్యాక్టరీనా? అని పీవీపీ ప్రశ్నించారు.

 

ప్రపంచంలోనే శ్రేష్ఠమైన పప్పులను చంద్రబాబు తయారుచేసి వదులుతున్నాయని టీడీపీ నేతలను పరోక్షంగా ప్రస్తావించారు. అసలు ప్రభుత్వం కృత్రిమ వరదలను సృష్టించడం ఏంటని ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న టీడీపీ నేతల బుర్రల్లో ఇప్పటికైనా ఇస్మార్ట్ చిప్పులు పెట్టాలని సూచించారు. ఈ మేరకు చంద్రబాబు ట్వీట్ చేశారు.

Leave a Reply