చంద్రబాబు, కేశినేని, సుజనా వీళ్ళే గగ్గోలు పెట్టేది…

Share Icons:

అమరావతి:

ఏపీ రాజధాని అమరావతి విషయంపై ఇంకా రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంది. ఇటీవల రాజధానిపై వైసీపీ ప్రభుత్వం త్వరలో ఓ కీలక ప్రకటన చేయబోతుందంటూ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యల వేడి ఇంకా తగ్గలేదు. దీనిపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే, వైసీపీ నేతలు మాత్రం రాజధానిని తరలిస్తామని చెప్పలేదుగా అని చెబుతున్నారు. ఈ తరుణంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందిస్తూ ఓ ట్వీట్ చేశారు.

‘అమరావతి నుంచి రాజధానిని తరలించేందుకే ముంపునకు గురిచేశారని గగ్గోలు పెడుతున్నవారెవరో గమనించారా? చంద్రబాబు, సుజనా, కేశినేని, సీఎం రమేశ్, లోకేశ్, కోడెల, ఉమ, వీళ్ల బినామీలు, ‘కావాల్సిన’ వాళ్లు.. రైతులను మోసం చేసి వారి వద్ద నుంచి వేల ఎకరాల భూములు కొనుగోలు చేశారని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ ధరలు పడిపోతాయన్నదే వారి ఏడుపు అంటూ విమర్శలు చేశారు.

గతంలో సోము వీర్రాజును ఏపీ బీజేపీ అధ్యక్షుడు కాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని తెలిపారు. తాజాగా కన్నా లక్ష్మీనారాయణను టార్గెట్ చేశారని… ఆయనను ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించి, తన విధేయుడిని ఆ స్థానంలో కూర్చోబెట్టేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. తన సొంత మనుషులు సుజనా చౌదరి, సీఎం రమేష్ ల ద్వారా ఢిల్లీలో లాబీయింగ్ చేయిస్తున్నారని చెప్పారు. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను వీరిద్దరూ ఎప్పటికప్పుడు తమ బాస్ చంద్రబాబుకు బ్రీఫ్ చేస్తుంటారని తెలిపారు.

Leave a Reply