విజయ్ ‘టాక్సీవాలా’ కూడా లీక్ చేశారు…..

Share Icons:

హైదరాబాద్, 21 ఆగష్టు:

ప్రస్తుతం టాలీవుడ్‌లో కొత్త సినిమాల లీకుల పర్వం నడుస్తోంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ నటించిన ‘గీత గోవిందం’ సినిమాలో కొన్ని సన్నివేశాలు రిలీజ్‌కి ముందే ఆన్‌లైన్‌లో దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ సినిమా విడుదలై ఘన విజయం సాధించింది. అలాగే ఎన్టీఆర్ తాజా చిత్రం అరవింద సమేతకి సంబంధించిన కొన్ని పిక్స్ కూడా నెట్‌లో హల్చల్ చేశాయి.

ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ నటించిన మరో చిత్రం ‘టాక్సీవాలా’ కూడా లీకుల బారిన పడింది. ప్రస్తుతం ఎడిటింగ్ స్టేజ్‌లో  ఉన్న ఈ సినిమా….ఎడిటింగ్ కూడా పూర్తికాక ముందే హెచ్ డి ప్రింట్ నెట్ లో వైరల్ అవుతోంది. ఇది గమనించిన చిత్ర నిర్మాతలు సోమవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యూట్యూబ్, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇలా అన్ని సోషల్ మీడియా నెట్ వర్క్స్ లో సినిమాను అప్లోడ్ చేశారు.

ఇప్పటికే తెలుగు ఫిలిం ఛాంబర్ అధీనంలో ఉన్న యాంటీ వీడియో పైరసీ సెల్ కి ఫిర్యాదు చేశామని, వారి ద్వారా కీలక సమాచారం సేకరించామని నిర్మాణ సంస్థ ఫిర్యాదులో పేర్కొంది.

మామాట: ఈ లీకులకి అడ్డుకట్ట పడేదెప్పుడో

Leave a Reply