జగన్ పాత్రలో విజయ్ దేవరకొండ?

Vijay devarakonda is acted in ysr biopic?
Share Icons:

హైదరాబాద్, 14 సెప్టెంబర్:

పెళ్ళిచూపులు, అర్జున్ రెడ్డి, గీతగోవిందం సినిమాలతో టాలీవుడ్‌లో అగ్ర హీరోల స్థాయికి చేరుకున్నాడు విజయ్ దేవరకొండ. విజ‌య్ ప్ర‌స్తుతం నోటా అనే బైలింగ్యువ‌ల్ మూవీతో పాటు డియ‌ర్ కామ్రేడ్ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. అయితే రానున్న రోజుల‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ చేయ‌బోవు ప్రాజెక్టుల గురించి భారీ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇందులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రగా తెర‌కెక్కుతున్న యాత్ర ఒక‌టి. మహి.వి రాఘవ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటిస్తుండ‌గా, ఆయ‌న కొడుకు వైఎస్ జ‌గ‌న్‌ పాత్ర‌లో సూర్య గానీ .. కార్తీ గాని నటించ‌నున్నాడ‌ని అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి.

కాని తాజా స‌మాచారం ప్ర‌కారం జ‌గ‌న్ పాత్ర కోసం విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని సంప్ర‌దించ‌బోతున్నార‌నే టాక్స్ ఎక్కువ‌గా వినిపిస్తున్నాయి. విజ‌య్ ప్ర‌స్తుతం చేస్తున్న నోటా చిత్రం రాజ‌కీయాల నేప‌థ్యంలో రూపొంద‌డ‌డం, దాంతో పాటు ఈ కుర్ర హీరోకి యూత్‌లో ఎక్కువ క్రేజ్ ఉండ‌డంతో జ‌గ‌న్ పాత్ర‌కి విజయ్ దేవరకొండను తీసుకోవడం మంచిదనే ఉద్దేశంతో సంప్రదింపులు మొదలైనట్టుగా తెలుస్తోంది.

మామాట: మరి ఈ వార్తల్లో నిజమెంతో…

Leave a Reply