కపిల్‌దేవ్ బయోపిక్‌లో విజయ్ దేవరకొండ…

Share Icons:

హైదరాబాద్, 22 డిసెంబర్:

ఇండియన్ లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ జీవితం ఆధారంగా దర్శకుడు కబీర్ ఖాన్ ఓ  సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. దీనికి ’83’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో కపిల్ దేవ్ పాత్రలో రణవీర్ సింగ్ కనిపించనున్నాడు. అయితే ఈ సినిమాలో మరో ముఖ్య పాత్ర కోసం టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండని సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఇందులో కపిల్ దేవ్ స్నేహితుడు ప్రముఖ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్ర కథకు కీలకమని తెలుస్తోంది. ఈ పాత్రలో విజయ్ దేవరకొండని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఏడాదిలో సినిమా షూటింగ్ మొదలుకానుంది. 2020లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా సినిమా విజయ్ నటించడం ఖాయమని అంటున్నారు!

మామాట: మొత్తానికి విజయ్ బాలీవుడ్‌కి వెళ్లనున్నాడు అనమాట…

 

Leave a Reply