చంద్రబాబు, కేటీఆర్ అంటే చాలా ఇష్టమంటున్న విజయ్….

vijay devarakonda comments on chandrababu and ktr
Share Icons:

హైదరాబాద్, 5 అక్టోబర్:

పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతగోవిందం లాంటి సినిమాలతో మంచి విజయాలు సాధించి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు హీరో విజయ్ దేవరకొండ. ఇక తాజాగా ఆయన నటించిన నోటా చిత్రం ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

ఈ నేపథ్యంలోనే ‘నోటా’ ప్రమోషన్ లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజయ్ మాట్లాడుతూ….ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే తనకు చాలా ఇష్టమని తెలిపాడు. తాను చిన్నప్పటి నుంచి చంద్రబాబు నాయకత్వాన్ని చూశానని, హైదరాబాదును అగ్రశ్రేణి నగరంగా చంద్రబాబు తయారు చేశారని కితాబిచ్చారు.

అలాగే ఉద్యోగులంతా సరైన సమయానికే కార్యాలయాలకు వచ్చేందుకు ఆయన బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని అమలు చేశారని… అది తనకు ఎంతో నచ్చిందని చెప్పాడు. అయితే ఈ విధానాన్ని తీసుకువచ్చిన చంద్రబాబు పట్ల ఉద్యోగులు ఆగ్రహాన్ని వెలిబుచ్చారని అన్నాడు. ఎవరు గొప్ప ముఖ్యమంత్రి అనే ప్రశ్నకు బదులుగా ఆ విషయం తనకు తెలియదని చెప్పాడు.

అదేవిధంగా ‘నోటా’ సినిమా కోసం తాను తెలంగాణ యువనేత కేటీఆర్ స్టయిల్ ను ఫాలో అయ్యానని, కొన్ని చోట్ల ఆయన లుక్స్ ను డిటో దింపామని విజయ్ చెప్పాడు. కేటీఆర్ అంటే తనకు చాలా ఇష్టమని, ఆయన ఫొటోలకు ఫోజులిచ్చే టైపు కాదని అన్నాడు.

మామాట: విజయ్…ఆంధ్రా…తెలంగాణ రెండిటినీ బాగానే కవర్ చేశాడు….

Leave a Reply