‘వరల్డ్ ఫేమస్ లవర్’కు నలుగురు లవర్స్….

janu and world famous lover movies released on February month
Share Icons:

హైదరాబాద్: విజయ్ దేవరకొండ హీరోగా, క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. ఈ సినిమాలో విజయ్ కు నలుగురు లవర్స్ ఉంటారంట..వారి నలుగురు ఫోటోలని వరుసగా నాలుగు రోజుల్లో విడుదల చేస్తామని విజయ్ ప్రకటించారు.  కాగా, ఈ సినిమా నుంచి ఇటీవలే విడుదలైన లుక్స్ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన తెచ్చుకున్నాయి.

ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన నలుగురు అందాల భామలు నటిస్తున్నారు. రాశీఖ‌న్నా, ఐశ్వ‌ర్యా రాజేశ్‌, క్యాథ‌రిన్ ట్రెసా, ఇజాబెల్లా ఈ నలుగురూ మన క్రేజీ స్టార్‌తో రొమాన్స్ చేస్తున్నారు. వీళ్లందరితో మనోడు చేసే రొమాన్స్ ఈ సినిమాలో హైలైట్ కానుందని సమాచారం. యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న హీరో కావడం పైగా నలుగురు అందాల భామలతో రొమాన్స్ అనేసరికి ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది.

ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తన నలుగురు లవర్స్‌ని పరిచయం చేయబోతున్నాడట విజయ్ దేవరకొండ. ఈ మేరకు ఈ విషయాన్ని తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. నాలుగు రోజుల్లో వరుసగా నలుగురు లవర్స్ పోస్టర్స్ మీ ముందుంచుతానని ఆయన తెలిపాడు. సరికొత్తగా ఇలా విజయ్ చేస్తున్న ప్రమోషన్ చూసి వావ్! అంటున్నారు నెటిజన్లు.

ఈ మేరకు డిసెంబ‌ర్ 12న ఐశ్వర్యా రాజేష్‌, డిసెంబ‌ర్ 13న ఇజా బెల్లా, డిసెంబ‌ర్ 14న క్యాథరిన్ త్రెసా, డిసెంబ‌ర్ 15న రాశీఖ‌న్నాల‌ పోస్టర్స్ విడుదల చేయనున్నామని తెలిపాడు విజయ్ దేవరకొండ. అయితే ఈ నలుగురికీ తేదీలు వేరైనా ముహూర్తం మాత్రం ఓకే సమయానికి పెట్టడం విశేషం. ఆ నాలుగు రోజులు సాయంత్రం 6:03 కు ఈ పోస్టర్స్ రిలీజ్ చేయనున్నారు.

ఆర్‌ఆర్‌ఆర్ అప్డేట్…

ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో….దర్శకుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ జరుగుతున్న దృశ్యాలు ఆన్ లైన్ లో లీక్ కావడంతో, అప్రమత్తమైన యూనిట్ మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్న వేళ, ఆయన లుక్, సన్నివేశాలను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో ఉంచడంతో వైరల్ అయింది. దీంతో ఎన్టీఆర్ అఫీషియల్ లుక్ ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. తలపాగా, గడ్డంతో సీరియస్ గా చూస్తున్నట్టు ఉన్న ఎన్టీఆర్ లుక్ మరింత వైరల్ అవుతోంది.

 

Leave a Reply