తుఫాన్ బాధితులకోసం పశువైద్య విద్యార్ధుల విరాళం

Share Icons:
అమరావతి, నవంబర్ 13,
గన్నవరం ఎన్టీఆర్ పశువైద్య కళాశాల విద్యార్థులు  తమ ఒక రోజు భోజనం ఖర్చు ను తిత్లీ తుఫాను బాధితులు కోసం సీఎం సహాయనిధికి  విరాళంగా 60 వేల రూపాయలు అందజేశారు. మంగళవారం సీఎం చంద్రబాబును కలిసి విరాళం తాలుకు చెక్ ను అందచేసారు. తుఫాను బాధితులకు సాయం చేసేందుకు ముందుకు వచ్చిన విద్యార్థులను సీఎం అభినందించారు. ప్రతి ఒక్కరు స్ఫూర్తి తీసుకుని సాయం చేసేందుకు ముందుకు రావాలని  అయన   పిలుపునిచ్చారు. 250 గ్రామీణ పశువైద్య కేంద్రాలను వెటర్నరీ డిస్పన్సరీ లుగా  ఉన్నతీకరించాలని సీఎంకు  వెటర్నరీ విద్యార్థులు వినతిపత్రం అందజేశారు.
వినతి పత్రం చదివి సమస్యపై సానుకూలంగా స్పందించారని  ఆంధ్రప్రదేశ్ పశువైద్య పట్టభద్రుల ,విద్యార్ధి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై. యశ్వంత్ నాయుడు తెలిపారు. తిత్లీ తుఫాను బాధితుల కోసం ముఖ్యమంత్రి తీసుకున్న సహాయచర్యలు ఎంతో స్ఫూర్తివంతమని,  సీఎం కష్టానికి అసరా నిలబడాలనే ఉద్దేశంతో తుఫాను బాధితులకు సాయం చేశామన్నారు.
మామాట: విద్యార్థులు మంచిపనులు కూడా చేస్తుంటారు ..

Leave a Reply