TRENDING NOW

అబ్బే.. వీరమాచినేని  డైట్ పనిచేయలేదు…

అబ్బే.. వీరమాచినేని  డైట్ పనిచేయలేదు…

హైదరాబాద్, ఆగస్టు 28,

ఇటీవల మధుమేహం నివారణపై రెండు రాష్ట్రాలలో విపరీతమైన చర్చజరిగింది.  నిజానికి ఈ డైట్ ను పరిచయం చేసిన వీరమాచినేని రామకృష్ణ.. దీనివల్ల షుగర్ ఉన్నవారు  ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు. 90 నుంచి 120 రోజుల పాటు ఈ ఆహార నియమాలు పాటిస్తే.. షుగర్ ను పూర్తిగా అరికట్టవచ్చని అంటున్నారు. అంతే కాదు శాంతా బయోటెక్నిక్స్ కంపెనీ వ్యవస్థాపకుడు వరప్రసాద్ రెడ్డి కూడా ఈ డైట్ తో ఇన్సులిన్ తీసుకోవడం ఆపేశారని వీరమాచినేని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

అయితే వీరమాచినేని ప్రకటనపై   వరప్రసాద్  రెడ్డి ఈ రోజు ఓ పత్రికకు లేఖ రాశారు. అందులో తాను, తన భార్య 80 రోజుల పాటు వీరమాచినేని ఆహార నియమాలను పాటించినట్లు వరప్రసాద్ తెలిపారు. ఈ డైట్ కారణంగా తన భార్యకు మెరుగైన ఫలితాలు వచ్చాయని వెల్లడించారు. ఈ ఆహార నియమాలు తనపై పెద్దగా ప్రభావం చూపలేకపోయానని పేర్కొన్నారు. తన స్పందన కోసం పలువురు ఎదురుచూస్తున్నట్లు తెలియడంతోనే ఈ లేఖ రాస్తున్నానని అన్నారు.

వీరమాచినేని డైట్ లో చెప్పిన విధంగా తామిద్దరం వరి బియ్యం, పప్పులు, పండ్లు, దుంపలు, చక్కెర, బెల్లం భోజనంలో లేకుండా జాగ్రత్త పడినట్లు తెలిపారు. రోజుకు ఆహారంలో 70 గ్రాముల కొబ్బరినూనెతో పాటు, ఆవు నెయ్యి, 2-3 కోడిగుడ్లు తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ సమయంలో ఇన్సులిన్ మాత్రలు, ఇంజెక్షన్లను వాడలేదన్నారు. ఇలా 80 రోజులు పాటించినా ఈ డైట్ తన షుగర్ వ్యాధిపై పెద్దగా ప్రభావం చూపలేకపోయిందనీ, తన భార్య షుగర్ మాత్రం నియంత్రణలోకి వచ్చిందని వెల్లడించారు. డైట్ పాటించిన కాలంలో తన షుగర్ నిల్వలు 180, 190కి తగ్గలేదని వరప్రసాద్ తెలిపారు. వీరమాచినేని ప్రకటన కారణంగా పలువురు తనకు ఫోన్ చేస్తూ ఉండడంతో  పత్రికాముఖంగా ఈ వివరణ ఇవ్వవలసి వచ్చిందన్నారు.

మామాట: ఆ మాత్రం తేడా ఇంగ్లీషు మందుల్లో కూడా ఉంటుందటగదా…

(Visited 41 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: