రూటు మార్చిన నాగ్, వెంకీ

nagarjuna and venkatesh
Share Icons:

హైదరాబాద్, 25 జూలై;

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోలు ఎవరు అనగానే ఠక్కున గుర్తొచ్చేవి నాలుగు పేర్లు. అవి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్. సుమారు మూడు దశాబ్దాలు పైగా స్టార్ హీరోలుగా తమ కెరీర్‌ను కొనసాగించిన ఈ హీరోలు ఇప్పుడు తమ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.

చిరంజీవి ఉయ్యలవాడ నరసింహరెడ్డి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండగా, బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్‌ని తెరకెక్కించే పనిలో ఉన్నారు. అయితే వీరిద్దరికి భిన్నంగా నాగార్జున, వెంకటేష్‌లు తమ రూటును మార్చి మల్టీస్టారర్స్ సినిమాలతో దూసుకెళ్తున్నారు.

ఈ ఇరువురు సోలో హీరోగా సినిమాలను తగ్గిస్తూ కాంబినేషన్స్‌నే ఎక్కువుగా నమ్ముతున్నారు. ఇప్పటికే వెంకటేష్ బాబీ దర్శకత్వంలోనాగ చైతన్యతో కలిసి ‘వెంకీ మామ’ అనే మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే వరుణ్ తేజ్ తో కలిసి ‘ఎఫ్ 2’ చిత్రంలో నటిస్తున్నారు.

ఇక నాగార్జున కూడా నానితో కలిసి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ మల్టీ స్టారర్ లో నటిస్తుండగా, అలాగే కరణ్‌ జోహార్‌ నిర్మాణంలో రూపొందుతున్న ‘బ్రహ్మస్త్ర’ చిత్రంలో అమితాబ్‌, రణ్‌బీర్‌ కపూర్‌ లతో కలిసి ఓ కీలక పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం నందమూరి కళ్యాణ్ రామ్ తో పవన్ సాదినేని దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో కూడ నాగ్ నటించనున్నారని తెలుస్తోంది.

మామాట: మంచి రూటే ఎంచుకున్నారు…

Leave a Reply