రికార్డు స్థాయిలో రాజన్న హుండీ ఆదాయం

రికార్డు స్థాయిలో రాజన్న హుండీ ఆదాయం
Views:
10

హైదరాబాద్, 21 ఫిబ్రవరి:

సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామి వారి దేవస్థానంలో ఇటీవలే హుండీ లెక్కింపు జరిగింది.

గత నెలలో వచ్చిన భక్తులు పెద్దమొత్తంలో మొక్కులు చెల్లించుకుని, విరాళాలు సమర్పించారు. దీనితో రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం వచ్చింది.

జనవరి 25 నుంచి 12 రోజుల వరకూ భక్తులు చెల్లించిన కానుకలను తాజాగా ఆలయ నిర్వాహకులు లెక్కించారు.

కేవలం 12 రోజుల్లోనే 1,04,35,000ల ఆదాయం వచ్చింది. అంటే అక్షరాల ఒక కోటీ నాలుగు లక్షల 35 వేల రూపాయలు అన్నమాట.

హుండీ ఆదాయం గురించి మాట్లాడిన ఈవో దూస రాజేశ్వర్ స్వామివారికి కేవలం 12 రోజుల్లోనే రూ.కోటి నాలుగు లక్షల ఆదాయం సమకూరిందని తెలిపారు.

డబ్బుతో పాటు 550 గ్రాముల బంగారం, 15 కిలోల వెండి వచ్చిందని తెలిపారు. ఒక అజ్ఞాత భక్తుడు 100 గ్రాముల బరువున్న రెండు బంగారు బిస్కెట్లను, వెండి కిరీటాలను హుండీలో వేశారని ఆయన వెల్లడించారు.

అయితే గత సంవత్సరాలతో పోలిస్తే ఇప్పుడు హుండీ ఆదాయం చాలావరకూ పెరిగింది. గతంలో 2016లో 85 లక్షలు, 2017లో 57.53 లక్షలు వచ్చింది.

మామాట: వారికెంత లాభం వస్తే హుండీలో ఇంత వేస్తున్నారో…

English summary:

Recently, Vemulavada Shri Parvati Rajarajeswaraswamy temple hundi was counted. In just 12 days, there were 1,04,35,000 revenue. Last month, devotees paid a large amount of money and offered donations. With this Hundi earned record level income.

(Visited 7 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: