వేలూరు లోక్ సభ స్థానాన్ని కైవసం చేసుకున్న డీఎంకే

Vellore Lok Sabha election result 2019
Share Icons:

చెన్నై:

 

సార్వత్రిక ఎన్నికల వేళ డీఎంకే అభ్యర్థికి చెందిన గిడ్డంగిలో భారీగా నగదు పట్టుబడటంతో వెల్లూరు స్థానంలో ఎన్నికల సంఘం ఎన్నిక వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఎన్నికల సంఘం సిఫారసు మేరకు ఉపఎన్నికను రాష్ట్రపతి రామ్‌నామ్ కోవింద్ రద్దు చేశారు.

 

అయితే అప్పుడు జరగాల్సిన ఎన్నిక ఈనెల 5న వెల్లూరు పోలింగ్ జరుగగా, ఇవాళ ఉదయం 8 గంటలకు స్థానిక ఇంజనీరింగ్ కాలేజీ ఆవరణలో భారీ భద్రత మధ్య ఓట్ల లెక్కింపు మొదలైంది. ఇక వెల్లూరు లోక్‌సభ ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష డీఎంకే విజయం సాధించింది. అధికార అన్నాడీఎంకేను చిత్తు చేసింది. డీఎంకే అభ్యర్థి కథిర్ ఆనంద్ తన సమీప అన్నాడీఎంకే అభ్యర్థి షణ్ముగంపై 8,141 ఓట్ల ఆధిత్యంతో గెలుపొందారు.

 

వేలూరు ఉపఎన్నికలో డీఎంకే విజయం సాధించడంతో లోక్‌సభలో డీఎంకే ఎంపీల బలం 24కు చేరింది. వేలూరు లోక్‌సభ ఉపఎన్నికల్లో డీఎంకే విజయం సాధించడంతో ఆ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద కార్యకర్తల సంబరాలు మొదలయ్యాయి.

 

Leave a Reply