బిగ్ బాస్ లో సందడి చేసిన గద్దలకొండ గణేశ్….డేరింగ్ లేడీ హిమజ ఔట్

Varun Tej Gaddalakonda Ganesh Visits Bigg Boss 3 Telugu House For Valmiki Promotions
Share Icons:

హైదరాబాద్: బిగ్ బాస్ ఆదివారం ఎపిసోడ్ లో అనేక రకాలైన ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయి. శనివారం రాహుల్ ఎలిమినేట్  అయినట్లు ప్రకటించి ఇంటి సభ్యులని ఏడిపించిన బిగ్ బాస్….రాహుల్ ది ఫేక్ ఎలిమినేషన్ అని నాగ్…మళ్ళీ తనని బిగ్ బాస్ ఇంటిలోకి పంపాడు. అయితే హౌస్ లోని ఓ ప్రత్యేక గదిలో రాహుల్ ని ఉంచారు. బిగ్ బాస్ తదుపరి ఆదేశాల వచ్చేవరకు రాహుల్ అక్కడే ఉండాలని చెప్పారు. ఇక తర్వాత నాగార్జున మన టీవీ ద్వారా ఇంటి సభ్యులని పలకరించి…వారితో ఓ గేమ్ ఆడించారు.

కెప్టెన్ మహేశ్ మినహా…మిగతా ఎనిమిది మందిని రెండు గ్రూపులుగా విభజించి డ్యాన్స్ పోటీ పెట్టారు. మొదటి గ్రూపులో బాబా భాస్కర్, పునర్నవి, వరుణ్, హిమజలు ఉండగా…రెండో గ్రూపులో శ్రీముఖి, శివజ్యోతి, వితికా, రవిలు ఉన్నారు. అయితే టాస్క్ లో భాగంగా మొదటి గ్రూపులో ఒకరు, రెండో గ్రూపులో ఒకరు వచ్చి పాటలకు డ్యాన్స్ చేయాలని పోటీ పెట్టారు. అలా మొదట వితికా, పునర్నవిలు పోటీ పడగా…ఇందులో వితికా గెలిచినట్లు కెప్టెన్ మహేశ్ ప్రకటించాడు.

ఆ తర్వాత బాబా, శ్రీముఖిలు పోటీ పడితే…బాబా విన్ అయ్యారు. ఇక హిమజ, శివజ్యోతిల్లో…హిమజ గెలిచింది. అలాగే వరుణ్, రవిలో రవి విన్ అయ్యాడు. దీంతో ఈ పోటీ టై అయిపోయింది. ఈ సరదా టాస్క్ తర్వాత ఇటీవల గద్దలకొండ గణేశ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన వరుణ్ తేజ్ బిగ్ బాస్ షోలోకి అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. వరుణ్,…ఇంటి సభ్యులతో సరదాగా మాట్లాడారు. అలాగే వాళ్ళకి గద్దలకొండ గణేశ్ సినిమా ట్రైలర్ ని చూపించారు.

ఇక తర్వాత మహేశ్, హిమజల్లో ఎవరు ఎలిమినేట్ అవుతారో చెప్పాలని నాగ్…వరుణ్ ని కోరాడు. దీంతో వరుణ్  హిమజ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. అయితే హిమజ తనదైన స్టైల్‌లో డేరింగ్ డేషింగ్ అంటూ నవ్వుతూనే బిగ్ బాస్ హౌస్‌ నుండి బయటకు వచ్చింది. అలాగే స్టేజ్ మీదకొచ్చిన హిమజ చేత…నాగ్ ఓ టాస్క్ ఇచ్చారు. ఇంటి సభ్యుల్లో….గుడ్, బ్యాడ్, అగ్లీ ఎవరో చెప్పి కారణాలు చెప్పాలని కోరారు. దీంతో హిమజ…శివజ్యోతి, రవి, వరుణ్, శ్రీముఖిలు గుడ్ అని…మహేశ్, వితికా, పునర్నవిలు బ్యాడ్ అని , బాబా భాస్కర్ అగ్లీ అని చెప్పింది. చివరికి తాను వెళుతూ…వెళుతూ బిగ్ బాంబ్ మహేశ్ మీద వేసింది. బిగ్ బాంబ్ ప్రకారం…లివింగ్ రూమ్ నుంచి…గార్డెన్ ఏరియాలోకి ఏ సభ్యులు వెళ్ళిన మహేశ్ డోర్ తీయాలి.

 

Leave a Reply