TRENDING NOW

వెంకీతో అప్పుడే చేయాల్సింది..

వెంకీతో అప్పుడే చేయాల్సింది..

హైదరాబాద్, 11 జనవరి:

విక్టరీ వెంకటేశ్ .. వరుణ్ తేజ్ హీరోలుగా దర్శకుడు అనిల్ రావిపూడి ‘ఎఫ్ 2’ సినిమాను తెరకెక్కించాడు. ఇక సంక్రాంతి కానుకగా ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా హీరో వరుణ్ తేజ్ ఒక ఆసక్తికరమైన విషయం వెల్లడించాడు. తన చిన్నప్పుడే వెంకటేశ్ సినిమాలో చేసే అవకాశం వచ్చిందని, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ సినిమాలో వెంకటేశ్ కొడుకుగా చేసే అవకాశం వచ్చిందిగానీ చేయలేకపోయానని చెప్పాడు.  

GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,
Life Homepathy
treefurn AD

ఇక ఆ తరువాత వెంకటేశ్ హీరోగా చేసిన ‘వాసు’ సినిమాలో ఆయన తమ్ముడిగా చేసే అవకాశం కూడా వచ్చిందని, అయితే తాను అప్పుడు బాగా లావుగా ఉండటం వలన ఆ ఛాన్స్ చేజారిందని అన్నాడు. అప్పటి నుంచి వెంకటేశ్ తో కలిసి నటించే అవకాశం కోసం ఎదురుచూస్తూనే వున్నానని, చివరికి ఎఫ్2తో కుదిరిందని చెప్పాడు.

మామాట: మొత్తానికి ఇప్పుడు కుదిరింది అన్నమాట..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: