టీడీపీకి రాజీనామా చేసిన వంటేరు..!

TTDP leader vanteru pratap reddy resigns the party
Share Icons:

గజ్వేల్, 12 మే:

25 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక నేతగా ఉన్న తెలంగాణ తెలుగు రైతు అధ్యక్షుడు వంటేరు ప్రతాప్‌రెడ్డి ఈరోజు పార్టీకి రాజీనామా చేశారు.

పార్టీ అధినేత చంద్రబాబుకు సన్నిహితునిగా పేరున్న ఈయన గజ్వేల్‌ అసెంబ్లీ స్థానం నుంచి రెండుసార్లు పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

ఇక ఈరోజు గజ్వేల్ నియోజకవర్గంలోని తన అనుచరులతో సమావేశం కానున్న వంటేరు పార్టీ మారే అంశంపై చర్చించనున్నారు.

అయితే ఈ నెల 18న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీలో చేరే అవకాశం ఉంది.

ఇది ఇలా ఉండగా మహబూబ్‌నగర్‌లో కీలక నేతగా పేరున్న టీడీపీ ఇన్‌చార్జ్ వెంకటేశ్ పార్టీకి టాటా చెప్పి శుక్రవారం ఉత్తమ్‌కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

ఆయనతోపాటు పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా పార్టీ మారినట్టు తెలుస్తోంది. అయితే ఇంతమంది నాయకులు పార్టీని వీడుతున్న పార్టీ అధ్యక్షుడు ఎల్. రమణ  ఈ విషయంపై స్పందించకపోవడం గమనార్హం.

మామాట: వలస బాటపట్టిన టీటీడీపీ నేతలు..

Leave a Reply