వంజరి కులస్తులను ప్రభుత్వం ఆదుకోవాలి

Share Icons:

హైదరాబాద్, ఆగష్టు 29,

రెక్కాడితే గాని డొక్కాడని వంజరి కులస్తులను ప్రభుత్వం ఆదుకోవాలని అఖిల భారతీయ వంజరి సేవ సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. వంజరి కులానికి వృత్తి అంటూ లేదని ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలలో పశువులకు నాడాలు కొట్టడం, విస్తరాకులు కుట్టడం, బీడి కార్మికులుగా, ఆటో డ్రైవర్లుగా కడు బీద స్థితిలో జీవనం కొనసాగిస్తున్నారని సంఘం జాతీయ ఉపాధ్యక్షులు సాల్వేరు కృష్ణ తెలిపారు. బుధవారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో సంఘం నేతలు కాలేరు నర్సింగ్ రావు, ఎదుగని శంకర్ , కాలేరు సురేష్, రత్నం సంతోష్ లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం వివిధ బి సి కులాలకు భవన నిర్మాణాలకు స్థలం, నిధులు  కేటాయించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేసారు. అదే క్రమం లో రాష్ట్రం లో 3 లక్షల జనాబా కలిగిన వంజరలకు ప్రభుత్వం ప్రత్యెక ఫెడరేషన్ ను ఏర్పాటు చేయాలనీ, ఇతర కులాల మాదిరిగా వంజరులకు కూడా భవన నిర్మాణానికి స్థలం, నిధులు కేటా ఇంచాలని కోరారు. 1978 వరకు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో వంజరలు ఎస్ టి లుగా ఉండే వారని, అనంతరం వంజరులను ఎస్టి ల నుండి తొలిగించి బిసి (డి) లో చేర్చారని ఇది అన్యాయమన్నారు. మహారాష్ట్ర, రాజస్తాన్ రాష్ట్రాల్లో ప్రస్తతం వంజరలు ఎస్టిల్లో కోన సాగుతున్నారని తెలిపారు. 2014 ఎన్నికల సందర్బంగా నిజామాబాద్ లో ముఖ్యమంత్రి కేసిఅర్  వంజరలను ఎస్టి లు గా పునరుద్దరించాలని చేసిన ప్రకటనను అమలు చేయాలని వారు డిమాండ్ చేసారు.

ఇప్పటి వరకు వంజరి కులం వారు చట్ట సభల్లో అడుగుపెట్టలేదని తెలిపారు. రానున్న ఎన్నికల్లో పార్ల మెంటు, స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ ప్రాతినిద్యం కల్పించాలని వారు డిమాండ్ చేసారు., లేని పక్షం లో కనీసం నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాలని వారు ముఖ్యమంత్రి కెసిఆర్ కు విజ్ఞప్తి చేసారు. ఈ సమావేశం లో సంఘం ప్రతినిధులు రత్న సంతోష్, నిశాంగి సురేందర్, ఏరుగని హరినాథ్, ఏమికే రాజ్ కుమార్, ఆముద సాయి, ఎదుగని సాయి, కాలంచి అశోక్, కాలేరు నాగరాజు, డి.గంగరాజు, నవాతు కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

మామాట:  పోరాటం చేయాలి.. పోయేదేముంది.

Leave a Reply