మూడు నిమిషాల్లో రికార్డుని ఊడ్చేశారు…

మూడు నిమిషాల్లో రికార్డుని ఊడ్చేశారు…
Views:
7

హైదరాబాద్, 13 ఫిబ్రవరి:

హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2018 ప్రచారోద్యమం సరికొత్త రికార్డు సృష్టించింది.

ఈ కార్యక్రమంలో 15,320 మంది ఒకేసారి మూడు నిమిషాల పాటు చీపుర్లతో రోడ్లను ఊడ్చి, సరికొత్త రికార్డు నెలకొల్పారు.

అయితే గతంలో గుజరాత్‌లోని వడోదరలో 5,058 మందితో గిన్నీస్ రికార్డును నెలకొల్పగా, ఇప్పుడు దాన్ని హైదరాబాద్ అధిగమించింది.

అలాగే అమెరికాకు చెందిన హైరేంజ్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ కూడా దీనిని ప్రపంచ రికార్డుగా ప్రకటించింది.

a new record created hyderabad city

హైదరాబాద్‌లో ఈ నెల 15 నుంచి చేపట్టనున్న స్వచ్ఛ సర్వేక్షణ్ 2018 కార్యక్రమం సందర్భంగా ప్రచారోద్యమం నిర్వహించారు. ఇది రాంనగర్ కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో వీఎస్టీచౌరస్తా నుంచి బాగ్‌లింగంపల్లిలోని అంబేద్కర్ కాలేజీ వరకు జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కేటీఆర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఉద్యోగులు, విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నగరాన్ని అగ్రభాగాన నిలపాలని విజ్ఞప్తిచేశారు.

మామాట: స్వచ్ఛ ‘హైదరాబాద్’ ఎప్పటికీ అయ్యేనో…?

English summary:

A new record created in the program of Swachcha paryvekshan-2018 campaign in Hyderabad. In this program, 15,320 people were able to dip roads with three minutes at a time and set a new record.

(Visited 1 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: