మహాత్మాగాంధీ చివరి పర్సనల్ సెక్రటరీ వి. కల్యాణం మృతి

Share Icons:
  • నాలుగేళ్ల పాటు గాంధీతో కలిసున్న కల్యాణం
  • గాంధీ హత్య సమయంలో కూడా అక్కడే ఉన్న పీఎస్
  • కల్యాణం వయసు 99 సంవత్సరాలు

జాతిపిత మహాత్మాగాంధీ చివరి పర్సనల్ సెక్రటరీ వి.కల్యాణం  తుదిశ్వాస విడిచారు. వయసుకు సంబంధించిన కారణాలతో ఆయన చెన్నైలో మృతి చెందారు. ఆయన వయసు 99 సంవత్సరాలు. నిన్న మధ్యాహ్నం 3.30 గంటలకు కల్యాణం మృతి చెందినట్టు ఆయన కుమార్తె నళిని వెల్లడించారు. నేటి మధ్యాహ్నం 1.30 గంటలకు బసంత్ నగర్ శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

 

1922 ఆగస్ట్ 15న సిమ్లాలో కల్యాణం జన్మించారు. 1944 నుంచి 1948 వరకు గాంధీతో ఆయన కలిసి ఉన్నారని బయోగ్రాఫర్ కుమారి ఎస్ నీలకందన్ తెలిపారు. మహారాష్ట్రలోని సేవాగ్రామ్ ఆశ్రమంలో కల్యాణం ఉన్నారని…. గాంధీకి వివిధ భాషల్లో వచ్చే లేఖల వ్యవహారాలను ఆయన చూసేవారని చెప్పారు. నాలుగేళ్ల పాటు గాంధీకి ఆయన సేవలందించారని తెలిపారు. 1948 జనవరి 30న ఢిల్లీలో మహాత్మాగాంధీ హత్యకు గురైనప్పుడు కూడా కల్యాణం అక్కడే ఉన్నారని చెప్పారు.

 

-కె. రాంనారాయణ, జర్నలిస్ట్.

Leave a Reply