కేసీఆర్….గాంధీ కుటుంబం చెప్పుకు కూడా సరిపోవు…

Share Icons:

హైదరాబాద్, 7 సెప్టెంబర్:

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. నిన్న అసెంబ్లీ రద్దు తర్వాత మీడియా సమావేశంలో రాహుల్ ఓ బఫూన్ అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే.

ఈ నేపథ్యంలోనే కేసీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈరోజు ఆ పార్టీ సీనియర్ నేత వీ. హనుమంతరావు మీడియాతో మాట్లాడుతూ… కేసీఆర్ తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని, గాంధీ కుటుంబం చెప్పుకు కూడా కేసీఆర్ సరిపోరని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అసలు దేశం కోసం గాంధీ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందని, తెలంగాణ కోసం కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. ఇక రానున్న ఎన్నికల్లో బీసీలకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయాలని, ప్రతి జిల్లాలో బీసీలకు మూడు సీట్లను కేటాయించాలని ఆయన కోరారు. అయితే ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా తనకు అభ్యంతరం లేదని, కానీ కార్యకర్తలకు అన్యాయం జరగకుండా చూసుకోవాలని సూచించారు.

మామాట: ఎన్నికల అయ్యేవరకు ఈ మాటల యుద్ధం ఆగేలా లేదుగా…

Leave a Reply