హైదరాబాద్, 30 నవంబర్:
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య విమర్శలు.. ప్రతి విమర్శలు పెరిగిపోయాయి. వారు బహిరంగ సభల్లోనే కాకుండా సోషల్ మీడియా వేదికగా కూడా ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు.
గురువారం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని విమర్శిస్తూ.. మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘‘మహాకూటమి అధికారంలోకి వస్తే.. పరిస్థితి ఇలానే ఉంటుంది. కాంగ్రెస్ నేతలకు వెన్నుముక, ఆత్మగౌరవం లేవు’’ అంటూ రాహుల్, చంద్రబాబు కూర్చొని ఉండగా.. ఉత్తమ్ నిల్చొని ఉన్న ఫోటోని కేటీఆర్ ట్వీట్ చేశారు.
https://twitter.com/KTRTRS/status/1068021526446919681
ఆ ట్వీట్‌కి సమాధానంగా ఉత్తమ్ మరో ట్వీట్ చేశారు. తమపై విమర్శలు చేస్తున్నవారందరికీ ఇదే మా సమాధానం అంటూ.. మోదీ, కేసీఆర్ కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశారు. ఆ ఫోటోలో కేసీఆర్.. వంగి మరీ మోదీకి షేక్ హ్యాండ్ చేస్తున్నట్లుగా ఉన్నాయి ఆ ఫోటోలు. నా ఫోటోపై కామెంట్ చేసే ముందు మీ తండ్రి ప్రధాని నరేంద్రమోదీ ముందు ఎలా సరెండర్ అయ్యారో చూడండి అంటూ ఉత్తమ్ ట్వీట్ చేశారు.
People who commented on one of my photographs should first look at their father surrendering before PM Modi. pic.twitter.com/GGR4gEEHkJ
— Uttam Kumar Reddy (@UttamTPCC) November 29, 2018
మామాట: ఎన్నికలు అయ్యేవరకు వీరి మాటలు యుద్ధం ఆగదులే…