ఈవీఎంల టాంపరింగ్‌ జరిగింది…

Share Icons:

హైదరాబాద్ 11 డిసెంబర్:

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీకి వన్ సైడ్‌గా మెజారిటీ రావడంపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.  ఫలితాలను చూస్తే  ఈవీఎంలు టాంపరింగ్‌ చేసినట్లు అర్థం అవుతుందన్నారు. ఫలితాల నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసలు ఎవరెవరూ ఓడిపోతారో టీఆర్‌ఎస్‌ నాయకులు ముందే ఎలా చెప్పగలిగారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఈ పరిణామాలని చూస్తుంటే టాంపరింగ్‌ను బలపరుస్తున్నాయన్నారు. అయితే వీవీ ప్యాట్‌ స్లిప్‌లను లెక్కింపు కూడా తప్పక జరపాలన్నారు. ఈ విషయంలో ప్రజా కూటమి అభ్యర్థులు రిటర్న్‌ అధికారులకు ఫిర్యాదు చేయాలని, వీవీప్యాట్‌ లెక్కింపు జరిపే వరకు పట్టుపట్టాలని సూచించారు. ఈ విషయంపై ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు.

ఇక తెలంగాణ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీ హనుమంతరావు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేసిందని ఆరోపించారు. ఫలితాలు చూస్తే ట్యాంపరింగ్‌ జరిగనట్లు స్పష్టమవుతోందని,  ప్రతి ఒక్కరూ కాంగ్రెస్‌ గెలుస్తుందన్నారని, తీరా ఫలితాలు చూస్తే వేరేలా ఉన్నాయని, ఒక్క రోజు క్యాంప్‌ ఆఫీస్‌కు రాకుండా ఇంట్ల పడుకున్న వ్యక్తికి జనాలు ఎలా ఓటేస్తారని మండిపడ్డారు.

మామాట: మరి రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ఘడ్‌లో కూడా టాంపరింగ్‌ జరిగాయా

Leave a Reply