నల్గొండ బరిలో ఉత్తమ్…?

tpcc-chief-uttam-kumar-reddy-busy-in-delhi-tour
Share Icons:

హైదరాబాద్, 18 మార్చి:

ఇప్పటికే 8 మందితో తెలంగాణలో పోటీ చేసే లోక్‌సభ అభ్యర్ధులని ప్రకటించిన కాంగ్రెస్ రెండో జాబితా విడుదల చేయడానికి సిద్ధమైంది. ఆదిలాబాద్-రమేష్ రాథోడ్, మహబూబాబాద్-బలరాం నాయక్, పెద్దపల్లి -ఎ.చంద్రశేఖర్, కరీంనగర్-పొన్నం ప్రభాకర్, మల్కాజిగిరి-రేవంత్ రెడ్డి, జహీరాబాద్-మదన్ మోహన్, చేవెళ్ల-కొండ విశ్వేశ్వర్ రెడ్డి, మెదక్-గాలి అనిల్ కుమార్ పేర్లను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ… మరో తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.

తాజాగా మరో నాలుగు లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ ఖరారు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. నల్లగొండ, భువనగిరి, నాగర్ కర్నూల్, వరంగల్ లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిందని తెలుస్తోంది. అయితే నల్లగొండ బరిలో ఎవరూ ఊహించని విధంగా టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని నిలపాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే భువనగిరి బరిలో మాజీ మంత్రి కోమటిరెడ్డి ఉంటారని తెలుస్తోంది.

మామాట: మొత్తానికి కాంగ్రెస్ ప్రయోగాలు చేస్తోంది…

Leave a Reply