ఇళ్లపై కూలిన చార్టెడ్‌ విమానం…5గురు మృతి..

up-government-chartered-crashes-on-mumbai
Share Icons:

ముంబై, 28 జూన్:

ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన చార్టెడ్ విమానం ఒకటి ముంబయి ఘట్కోపర్‌ ప్రాంతంలో కుప్పకూలింది. మరికొద్ది సేపటిలో ల్యాండ్ అవ్వాల్సి ఉండగా నిర్మాణంలో ఉన్న ఓ భవంతిపై కుప్పకూలినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

అయితే కూలిన వెంటనే మంటలు చెలరేగడంతో విమానంలో ప్రయాణిస్తున్న ఇద్దరు పైలెట్లు, ఇద్దరు ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజినీర్లు అక్కడిక్కడే మృతి చెందారు. ఇక అది కూలిన స్థలంలో ఉన్న ఒక వ్యక్తి కూడా మరణించినట్లు తెలుస్తోంది.  కాగా, ఈ ప్రమాదం మధ్యాహ్నం 1:15 గంటలకు జరిగినట్లు డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దృవీకరించింది.

ఇక ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక బృందాలు ప్రయత్నిస్తున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సైతం ఘటనా ప్రాంతానికి తరలివెళ్లాయి. అయితే ప్రమాదం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మామాట: మరి ప్రమాదానికి కారణం ఏమి అయి ఉంటుందో..?

Leave a Reply