మోడీ మాయాజాలానికి యుపి అడ్డుక‌ట్ట‌

Share Icons:

మోడీ మాయాజాలానికి యుపి అడ్డుక‌ట్ట‌

తిరుగులేని విజ‌యాలు సాధిస్తున్న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి, అధికార బిజెపికి ఉత్త‌ర‌ప్ర‌దేశ్ చేదు రుచి చూపించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో జ‌రిగిన లోక్‌స‌భ ఉప ఎన్నికల్లో అధికార బిజెపికి గట్టి షాక్‌ తగిలింది. బిజెపిని తోసిరాజ‌ని సమాజ్‌వాదీ పార్టీ ఘన విజయం సాధించింది. ఇది ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి ఆదిత్యానాథ్ క‌న్నా ప్ర‌ధాని మోడీకే ఎదురుదెబ్బ‌గా చెప్ప‌వ‌చ్చు.

అలుపెర‌గ‌ని గెలుపులు రుచి చూస్తున్న ప్ర‌ధాని మోడీకి ఇది మింగుడుప‌డ‌ని వ్య‌వ‌హార‌మే. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సొంత నియోజకవర్గంలో ఘోర ఓట‌మి ఎదురుకావ‌డం క‌మ‌ల‌నాథుల‌కు మింగుడుప‌డ‌టం లేదు.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగీ ఆదిత్య‌నాథ్ ఐదు సార్లు గెలిచి ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత ఆ స్థానానికి రాజీనామా చేశారు. అలా ఖాళీ అయిన గోర‌ఖ్‌పూర్ లోక్‌స‌భ స్థానంలో స‌మాజ్‌వాది పార్టీ గెలిచింది.

అదే విధంగా ఫుల్‌పూర్ లోక్‌స‌భ స్థానంలో గెలిచిన కేశశ్ ప్ర‌సాద్ మౌర్య ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు ఉప ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఆ త‌ర్వాత ఈ స్థానానికి రాజీనామా చేశారు. ఈ స్థానానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌లో కూడా స‌మాజ్ వాది పార్టీ 59613 ఓట్ల మెజారిటీతో గెలిచింది.

భారతీయ జనతాపార్టీ ఈ ఉప ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రచారం నిర్వహించింది. తొలుత గోరఖ్‌పూర్‌ లోక్‌సభ స్థానంలో బిజెపి ఆధిక్యంలో కొనసాగింది. కానీ తర్వాత అనూహ్యంగా ఎస్పీ అభ్యర్థి ఆధిక్యంలోకి వచ్చారు. బిజెపికి కంచుకోటగా ఉన్న గోరఖ్‌పూర్‌లో సమాజ్‌వాదీ పార్టీ అఖండ విజయాన్ని నమోదు చేసుకోవ‌డం మోడీ ప‌రువును దేశ‌వ్యాప్తంగా తీసిన‌ట్లు అయింది.

ఈశాన్య రాష్ట్రాల్లో ఇటీవ‌లె గెలిచి త‌మ‌కు ఎదురు లేద‌ని, దేశం నుంచి క‌మ్యూనిస్టుల‌ను, కాంగ్రెస్‌ను త‌రిమి కొట్టామ‌ని చెప్పిన బిజెపి ఇప్పుడు ఓట‌మి బాట ప‌ట్ట‌డంతో క‌మ‌ల‌నాథులే హ‌తాశుల‌వుతున్నారు.

బిహార్‌లో బిజెపిని నిరాశే

ఇక బిహార్‌ ఉప ఎన్నికల్లోనూ బిజెపికి ఎదురుగాలే వీచింది. బిహార్‌లో ఒక లోక్‌సభ, రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు బిజెపికి చేదునే మిగిల్చాయి. జహనాబాద్‌ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు చెందిన ఆర్జేడీ అభ్యర్థి కృష్ణమోహన్ యాదవ్‌ విజయం సాధించారు.

ఇక అరారియా లోక్‌సభ స్థానంలోనూ ఆర్జేడీ అభ్యర్థి సర్ఫరాజ్‌ ఆలమ్‌ గెలుపొందారు. మరో అసెంబ్లీ స్థానమైన భబువాలో బిజెపి అభ్యర్థి రింకీ రాణి పాండే గెలుపొందారు.

బిహార్‌లో గతేడాది మహాకూటమి చీలిపోయిన విషయం తెలిసిందే. ఆర్జేడీతో తెగదెంపులు చేసుకున్న ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ జేడీయూ పార్టీ బిజెపితో పొత్తు పెట్టుకుంది. బిజెపి-జేడీయూ కూటమికి ఇదే తొలి సవాలు.

అయితే ఇందులో బిజెపి ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది.

ఏ పార్టీ అయినా గెలిచిన‌పుడు విర్ర‌వీగితే ఇలాంటి ఫ‌లితాలే వ‌స్తుంటాయి. గెలిచినా కూడా ఒద్దిక‌గా ఉంటే ప్ర‌జ‌లు కూడా ఆద‌రిస్తారు. ఇప్ప‌టికే ద‌క్షిణాది రాష్ట్రాల‌లో సున్నాగా మిగిలిపోయిన బిజెపి ఇప్పుడు క‌ర్నాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్న‌ది.

క‌ర్నాటక అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బిజెపి మంచి ఫ‌లితం సాధించ‌క‌పోతే ఆ త‌ర్వాత జ‌రిగే వివిధ రాష్ట్రాలు, లోక్‌స‌భ ఎన్నిక‌ల‌పై కూడా ప్ర‌భావం ప‌డ‌వ‌చ్చు.

English Summery:The Samajwadi Party handed BJP a crushing defeat in two crucial bypolls in Uttar Pradesh, forcing CM Yogi Adityanath to admit that the saffron party’s performance was a lesson for them. While SP candidate Nagendra Pratap Singh Patel defeated BJP’s Kaushlendra Singh Patel, the Akhilesh Yadav-led SP thumped BJP by a margin of 21,000 vote in Yogi’s bastion of Gorakhpur. The bypolls were necessitated after CM Adityanath and Deputy CM Keshav Prasad Maurya vacated their seats respectively following their election to the state legislative council.

Leave a Reply