అమెరికాలో కూతుర్ని చంపి, బాత్‌టబ్‌లో నగ్నంగా పడేసిన సవతి తల్లి.

Share Icons:

అమెరికా, మే 15,

ఇండియాకి చెందిన 55 ఏళ్ల షామ్దాయ్ అర్జున్… కూతురు అష్దీప్ కౌర్‌ని చంపిన కేసులో దోషిగా తేలింది. 2016లో తొమ్మిదేళ్ల కూతుర్ని అత్యంత దారుణంగా హత్య చేసింది. బాత్‌టబ్‌లో శవాన్ని నగ్నంగా పడేసి పోయింది. దీన్ని సెకండ్ డిగ్రీ మర్డర్‌గా కోర్టు నిర్ధారించింది. షామ్దాయ్ అర్జున్… తన భర్త సుఖ్జీందర్‌తో కలిసి… రిచ్‌మండ్ హిల్ హోంలో ఉంటోంది.

అక్కడ ఉన్న కొన్ని నెలలకే ఆమె హత్య చేసింది. తన తండ్రితో ఉండేందుకు ఇండియా నుంచీ ఆమెరికా వచ్చిన అష్దీప్ కౌర్… మూడు నెలలకే సవతి తల్లి చేతిలో ప్రాణాలు కోల్పోయింది. ఈ కేసులో షామ్దాయ్‌ని దోషిగా తేలిన సుప్రీంకోర్టు జూన్ 3న శిక్ష ఖరారు చెయ్యనుంది. ఆమెకు 25 ఏళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.

2016 ఆగస్టు 19న షామ్దాయ్ తన మాజీ భర్త రేమండ్ నారాయణ్‌, తన ఇద్దరు మనవళ్ల(3ఏళ్లు, 5ఏళ్లు)తో ఇంటి నుంచీ వెళ్లిపోతుండటాన్ని పక్కింటాయన చూశాడు. అష్దీప్ ఏది అని అడిగాడు. ఆమె తన తండ్రితో వస్తానని చెప్పిందని షామ్దాయ్… అతనితో అంది. రేమండ్ నారాయణ్‌తో ఆమె వెళ్లిపోయిన తర్వాత… బాత్‌రూం లైట్ వెలుగుతూ ఉండటాన్ని పక్కింటాయన చూశాడు.

దాదాపు రెండు గంటలుగా అలాగే వెలుగుతుండటంతో… డౌట్ వచ్చి… బాలిక తండ్రికి కాల్ చేశాడు. ఆయన వచ్చి బాత్‌రూం డోర్ తీసి చూశాడు. బాత్ టబ్‌లో బాలిక శవం నగ్నంగా కనిపించింది. తన భర్త సుఖ్జీందర్‌కూ తనకూ మధ్య గొడవలు జరగడానికి ప్రధాన కారణం సుఖ్జీందర్ కూతురేనని భావించింది షామ్దాయ్.

మాజీ భర్త రేమండ్ నారాయణ్‌కి తిరిగి దగ్గరైన ఆమె… సుఖ్జీందర్‌ను వదిలి వెళ్లిపోవాలని డిసైండైంది. ఆ క్రమంలో ఆయన కూతురు అష్దీప్ కౌర్‌ని చంపేయాలనుకుంది. ఆ బాలిక స్నానం చేస్తున్న సమయంలో… బాత్‌రూంలోకి వెళ్లి… పీక నొక్కి చంపేసింది.  హత్య తర్వాత ఆమెను తనతో తీసుకెళ్లాడు 65 ఏళ్ల రేమండ్ నారాయణ్. ఈ కేసులో షామ్దాయ్‌తోపాటూ… ఆమెకు సహకరించాడన్న కారణంతో రేమండ్ నారాయణ్‌ను కూడా అరెస్టు చేశారు పోలీసులు.

మామాట- మదర్ డే ఇంకా మరచిపోలేదు… అపుడే ఇలా

Leave a Reply