లఖింపూర్ ఖేరి ఘటనపై కేంద్రమంత్రి నిర్మల సంచలన వ్యాఖ్యలు!

Share Icons:
  • ఖండించాల్సిందే కానీ, అలాంటివి వేరే రాష్ట్రాల్లోనూ జరుగుతున్నా ఎందుకు మాట్లాడడం లేదంటూ అసహనం

అమెరికా పర్యటనలో వున్న మంత్రి నిర్మల.. బోస్టన్ లోని హార్వర్డ్ కెనడీ స్కూల్ లో విద్యార్థులతో మాటామంతి సందర్భంగా లఖింపూర్ ఖేరి ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు ఎందుకు స్పందించట్లేదని  విద్యార్థులు ప్రశ్నించారు. లఖింపూర్ ఖేరి ఘటనను ఖండించాల్సిందేనని, అయితే, ఇలాంటి ఘటనలే దేశంలోని చాలా చోట్ల జరుగుతున్నాయని, వాటి గురించి ఎందుకు మాట్లాడడం లేదని ఆమె ప్రశ్నించారు.

యూపీలో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టే ప్రశ్నిస్తున్నారని, రాజకీయ స్వార్థం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె సమాధానమిచ్చారు. ‘‘ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మీరు, అమర్త్యసేన్ లాంటి వారు గళం విప్పుతున్నారు. మంచిదే. అయితే, అది కేవలం వారికి సూట్ అవుతుందనిపిస్తే మాట్లాడుతున్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో జరిగితేనే గొంతెత్తుతున్నారు. వేరే చోట జరిగితే ఎందుకు మాట్లాడడం లేదు? వాటిపైనా మాట్లాడితే బాగుంటుంది. అని ఆమె అన్నారు.

ఇది సొంత పార్టీ, ప్రధాని నరేంద్ర మోదీని వెనకేసుకొచ్చేందుకు ఈ వ్యాఖ్యలు చేయట్లేదని, భారత్ కోసం చేస్తున్నానని ఆమె పేర్కొన్నారు.  సాగుచట్టాలపై అన్ని రాష్ట్రాలతో చర్చించామని, ఆ తర్వాతే వాటిని తీసుకొచ్చామని,. లోక్ సభలోనూ విస్తృత చర్చ జరిగిందని గుర్తు చేశారు. రాజ్యసభకు వచ్చేసరికి రచ్చ చేశారని, ప్రతిపక్షాలు దారుణంగా వ్యవహరించాయని అసహనం వ్యక్తం చేశారు.

-కె. రాంనారాయణ, సీనియర్ జర్నలిస్ట్.

Leave a Reply