బడ్జెట్ ప్రభావం…..ధరలు పెరిగేవి…..తగ్గేవి ఇవే…!

Union budget 2019-20...what-is-cheaper-what-is-costlier
Share Icons:

ఢిల్లీ:

 

శుక్రవారం కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే మధ్యతరగతి ప్రజలపై వరాలు కురిపిస్తుందని అనుకున్న బడ్జెట్‌లో పన్నుల మోత మోగింది. పెట్రోల్, డీజిల్‌తో పాటు బంగారం ధరలు పెరగనున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వాహనదారులకు బ్యాడ్ న్యూసే. పెట్రోల్, డీజిల్‌పై రూ.1 సెస్ విధిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. దీంతో పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరగనున్నాయి.

 

ఈ క్రమంలోనే ధరలు పెరిగే…తగ్గే వస్తువుల వివరాలు ఒక్కసారి పరిశీలిస్తే…

 

ధరలు పెరిగేవి..

 

 • పెట్రోల్
 • డీజిల్
 • బంగారం
 • దిగుమతి చేసుకునే పుస్తకాలు
 • డిజిటల్ కెమెరాలు
 • జీడి పప్పు
 • పీవీసీ
 • టైల్స్
 • మెటల్ ఫిట్టింగ్స్
 • మౌంటింగ్స్ ఫర్ ఫర్నీచర్
 • వాహన విడిభాగాలు
 • సింథటిక్ రబ్బర్
 • మార్బుల్ శ్లాబ్స్
 • ఆప్టికల్ ఫైబర్ కేబుల్
 • సీసీటీవీ కెమెరాలు
 • ఐపీ కెమెరా
 • సిగరెట్లు
 • స్పీకర్లు
 • డిజిటల్ అండ్ నెట్‌వర్క్ వీడియో రికార్డర్లు

 

ధరలు తగ్గేవి

 

 • ఎలక్ట్రానిక్ అప్లయెన్సెస్
 • ఎలక్ట్రిక్ వాహనాలు
 • గృహ రుణాలు
 • రక్షణ సామగ్రి
 • రిఫ్రిజిరేటెడ్ హీలియం లిక్విడ్
 • సిలికా రాడ్లు, ట్యూబులు
 • టెక్స్‌టైల్
 • ఉన్ని వస్తువులు
 • స్టీల్
 • మొబైల్ ఫోన్ల కెమెరాలు
 • మొబైల్ ఫోన్ల ఛార్జర్లు
 • లిథియమ్ అయాన్ బ్యాటరీలు
 • సెట్‌టాప్ బాక్స్

 

 

Leave a Reply