నిరుద్యోగభృతి 3,500 ఇచ్చేందుకు సిద్ధమైన కాంగ్రెస్ సీఎం….

Share Icons:

జైపూర్, 19 జూన్:

రాజస్తాన్ రాష్టంలోని నిరుద్యోగులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డిగ్రీ పూర్తి చేసి ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్న నిరుద్యోగ యువతకు నెలకు 3,500 అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ మేరకు సీఎం అశోక్ గెహ్లట్ నేతృత్వంలోని మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సంవత్సరం ఫిబ్రవరి మొదలుకుని ఈ నగదు సాయాన్ని అందించాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఇక ‘ముఖ్యమంత్రి యువ సంబల్ యోజన’ కింద ఈ సాయం అందనుంది. ఈ సాయం పొందాలంటే డిగ్రీ పూర్తి చేసి రాజస్థాన్‌కు చెందిన యవతై ఉండాలి. ఈ స్కీం కింద అర్హులైన యువకులకు నెలకు 3,000 రూపాయలు, యువతులకు, దివ్యాంగులకు 3,500 రూపాయల నిరుద్యోగ భృతి అందించనుంది.

కాకపోతే ఈ నగదు మొత్తం రెండు సంవత్సరాల వరకూ గానీ లేక వారికి ఉద్యోగం వచ్చేంత వరకూ గానీ అందించే అవకాశం ఉంది. ఇక  నిరుద్యోగ భృతికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడటంతో నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు…తమకు మంచి ఉద్యోగం దొరికే వరకు ఒక ఆసరా దొరికిందని చెబుతున్నారు.

 

Leave a Reply