అండర్ వరల్డ్ డాన్ దావూద్ సోదరి తెలుసా?

Share Icons:

ముంబై: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి గురించి మీకు తెలుసా? ఆమె ఎలా ఉంటుందో? ఏం చేసేదో తెలుసా? తెలియదా.. అయితే, మీరు ‘హసీనా పార్కర్’ సినిమా చూడాల్సిందే. గ్లామరస్ పాత్రలతో అందరినీ ఆకట్టుకుంటున్న శ్రద్ధాకపూర్ ఇప్పుడు దావూద్ సోదరి హసీనా పార్కర్ పాత్రలో నటిస్తోంది. అపూర్వా లఖియా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పోస్టర్ లో బురఖా ధరించి, భయంకరమైన కళ్లతో కోపంగా చూస్తున్న శ్రద్ధా అందరిలో ఎన్నో ప్రశ్నలను రేకెత్తిస్తోంది. పోస్టర్‌పై ‘80 కేసులున్నా ఒక్కసారే కోర్టుకెళ్లింది’ అని రాశారు. సోదరుడు దావూద్‌ పాత్రలో శ్రద్ధా సోదరుడు సిద్ధాంత్‌ కపూర్‌ నటిస్తున్నాడు. ఆగస్ట్‌ 18న విడుదలకు సిద్ధం అవుతోంది.

Leave a Reply