చంద్రబాబుకు, జగన్‌కి ఉన్న తేడా ఇదే?

Share Icons:

హైదరాబాద్, 6 ఆగష్టు:

ఉండవల్లి అరుణ్ కుమార్….ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన నేత…కానీ 2014లో రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఏ పార్టీలో చేరకుండా తటస్థంగా ఉండిపోయారు. ఇక అప్పటి నుంచి ఆయన ఒక రాజకీయ విశ్లేషుకుడిగా మారిపోయారు. దీంతో ఏదొక సమయంలో మీడియా ముందుకి వచ్చీ తనదైనశైలిలో తాజా రాజకీయ పరిస్థితులపై తన విశ్లేషణలు చెబుతుంటారు.

ఇక తాజాగా ఓ టీవీ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ… ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్‌కు చంద్రబాబునాయుడితో పోలిస్తే అడ్వాంటేజ్ అధికంగా ఉందని తెలిపారు.

అయితే చంద్రబాబు, జగన్‌ల మధ్య తేడా గురించి ప్రస్తావిస్తూ…ఎలక్షన్ మేనేజ్మెంట్‌లో చంద్రబాబు సిద్ధహస్తుడని, స్వయంగా వ్యూహాలను రచించగల దిట్టని చెప్పారు. కానీ జగన్ వద్ద ఎలక్షన్ మేనేజ్మెంట్ శక్తి లేదని, ఆయన వద్ద ఆ పనిని సమర్థవంతంగా చేసిపెట్టగల వారు ఎవరైనా ఉన్నారా? అన్న విషయం తనకు తెలియదని చెప్పారు.

అలాగే 2014 ఎన్నికలకు ముందు సైతం జగన్‌కు అడ్వాంటేజ్ ఉందని అందరూ భావించారని, అయితే, చివరి నెలన్నర రోజులూ చంద్రబాబు పన్నిన వ్యూహాలు ఫలితాలను మార్చి ఆయనకు అనుకూలంగా వచ్చాయని  తెలిపారు. కాగా, ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ నేతల్లో తక్కువ మంది టీడీపీలో, ఎక్కువమంది వైసీపీలో ఉన్నారని, జగన్ గెలిస్తే తాను కూడా ఆనందిస్తానని చెప్పారు.

మామాట: విశ్లేషణలు బాగానే చెబుతున్నారు…

Leave a Reply