జగన్‌కు ఉండవల్లి లేఖ…హైకోర్టు ఏర్పాటుపై సూచన

Share Icons:

రాజమండ్రి: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ లేఖ రాశారు. రాజమండ్రిలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కోరారు. 14 ఏళ్ల క్రితం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రాజమండ్రిలో బెంచ్ పెట్టాలని ఆలోచన చేశారని గుర్తు చేశారు. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేసి.. నిర్ణయం తీసుకోవాలని.. హైకోర్ట్ బెంచ్‌కు రాజమండ్రి అనుకూలమని లేఖలో ప్రస్తావించారు. రాజమండ్రిలో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటును పరిశీలించాలని జగన్‌ను కోరారు.

చాలా రోజులుగా హైకోర్ట్ బెంచ్‌ల వ్యవహారంపై ఏపీల చర్చ జరుగుతోంది. మూడు రాజధానుల ప్రస్తావన రాకముందు కర్నూలుతో పాటూ విశాఖలో హైకోర్టు బెంచ్‌లు ఏర్పాటు చేయాలనే డిమాండ్ వినిపించింది. జగన్ సర్కార్ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తేవడం.. కర్నూలుకు హైకోర్టును తరలిస్తామని చెప్పడంతో సీన్ కాస్త మారింది. అమరావతితో పాటూ విశాఖలో హైకోర్ట్ బెంచ్ ఏర్పాటు చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

అమరావతి, విశాఖలో బెంచ్‌ ఏర్పాటు అంశాన్ని పక్కన పెడితే.. మాజీ ఎంపీ ఉండవల్లి రాసిన లేఖ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఇప్పుడు తెరపైకి వచ్చింది.

ఇదిలా ఉంటే టీవీ ఛానళ్ల ప్రసారాల నిలిపివేతను ఉండవల్లి అరుణ్ కుమార్ తప్పుబట్టారు. వైఎస్ జగన్ సర్కార్ తీరును ఖండించారు. మీడియాతో బుధవారం మాట్లాడిన ఆయన..  కొన్ని ఛానల్స్ టెలీకాస్ట్ ఆపేయడం సరికాదన్నారు. ప్రసారాల నిలిపివేత వెనక ప్రభుత్వం లేదంటే ఎవరూ నమ్మరన్నారు. రాజమండ్రిలో ఛానల్స్ రావడం లేదని తెలిపారు. సీఎంగా వైఎస్ ఉన్నప్పుడు ఆయనకు మీడియా మొత్తం వ్యతిరేకమని.. కానీ ఏనాడు మీడియాను నియంత్రించే పని చేయలేదన్నారు. గతంలో కేసీఆర్ చేశారని.. ఆ పని ఇప్పుడు జగన్ చేస్తున్నారన్నారు. వ్యతిరేక వార్తలకు భయపడిన క్షణం.. పతనం ప్రారంభమైనట్టేనన్నారు. రాజమండ్రిలో ఏబీఎన్, టీవీ5 రావడంలేదని.. ఏనాడు విమర్శకు భయపడతామో అది పిరికితనమేనన్నారు.

 

Leave a Reply