అవినీతి చేయకుంటే ఏపీ ప్రజలు ఓట్లు వేయరు…

undavalli arun kumar sensational comments about 2019 elections
Share Icons:

విశాఖపట్నం, 4 జనవరి:

దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డిపై వ్యక్తిగతంగా అవినీతి ఆరోపణలు లేవని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. విశాఖపట్నంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

అయితే ప్రభుత్వంలో ఉన్న పైఅధికారులు నీతిగా ఉంటే కిందిస్థాయి ఉద్యోగులు నిజాయితీగా పనిచేస్తారని అన్నారు. కేరళకు వెళితే అక్కడ అవినీతి అనేదే ఉండదనీ, కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నా, కాంగ్రెస్ అధికారంలో ఉన్నా పారదర్శక పాలన ఉంటుందని తెలిపారు. అలా ఉంటేనే కేరళ ప్రజలు నాయకులకు ఎన్నికల్లో ఓటు వేస్తారని, కానీ ఏపీలోమాత్రం అవినీతి చేయకుంటే ఓటు వేయరని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అసలు ఇక్కడ ప్రజల నుంచే అవినీతి మొదలయిందని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ అవినీతి జరిగిందనీ, అయితే చంద్రబాబు హయాంలో జరిగినంత దారుణంగా అయితే లేదని స్పష్టం చేశారు.

ఇక ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష వైసీపీ విఫలం అయిందని, అసలు అసెంబ్లీని బాయ్ కాట్ చేయడం సరికాదని వ్యాఖ్యానించారు.అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేసిన పది శ్వేతపత్రాలపై తమకు అనుమానాలున్నాయని, బిజినెస్ సమ్మిట్‌తో తొలుత రూ.18 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారని, శ్వేతపత్రంలో మాత్రం రూ.1.45 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారని అన్నారు.

ఇక టీడీపీ నేతలు తన ఆరోపణలపై స్పందించక పోగా వ్యక్తిగతంగా తీసుకుంటున్నారని ఉండవల్లి వ్యాఖ్యానించారు.

మామాట: ప్రజలతో సహ అందరిపై విమర్శలు చేశారుగా…

Leave a Reply