కుటుంబరావుపై మండిపడ్డ ఉండవల్లి

Share Icons:

రాజమండ్రి, సెప్టెంబర్ 11:

రాష్ట్ర ప్రణాళిక బోర్డు వైస్ ఛైర్మన్ కుటుంబరావుపై మరోమారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మండిపడ్డారు. కుటుంబరావు చెప్పింది సత్యంగా భావిస్తానని, పోలవరం, బాండ్స్, పంపింగ్ స్కీమ్స్, హౌసింగ్ , 18లక్షల కోట్ల ప్రాజెక్టు ఎక్కడని, అందులో అవినీతి, రాజా ఆఫ్ కరప్షన్లపై చర్చిద్దాం రండని అన్నారు.

వాటిలో తప్పేమిలేదంటే అక్కడే క్షమాపణ కోరతానని, 18లక్షల కోట్ల పరిశ్రమలు ఎక్కడ వచ్చాయో చెప్పండని, కరప్షన్ కూ, కలెక్షన్ కూ కుటుంబరావుకు తెలియకపోవడం విచారకరమని ఆయన అన్నారు. లంచానికి రశీదులు ఇస్తారా. నేనెక్కడా అలా చూడలేదని, కుటుంబరావు వ్యాఖ్యలు హాస్యాస్పదంగా వున్నాయని చెప్పారు.

హౌసింగ్ స్కీమ్‌లో ఫీట్ నిర్మాణానికి బయటకంటే ఎక్కువ ధరకు కాంట్రాక్టుకు ఇచ్చారని, హడ్కో రుణం  8శాతం లోపుగా ఇస్తానంటేనే రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తామని చంద్రబాబు చెప్పారని, అలాంటిది 10.36 శాతం అధిక వడ్డీకి ఎందుకు బాండ్స్ తీసుకున్నారని తెలిపారు.

అమరావతి బాండ్స్ అన్నీ వ్యాపారమేనని, ఈ వ్యవహారం పై కుటుంబరావు సరైన వివరణ వారం రోజుల్లో ఇవ్వకపోతే సెబీకి ఫిర్యాదు చేస్తానని ఆయన హెచ్చరించారు. 21సార్లు చంద్రబాబు అప్పులు తెచ్చారని, చివరగా 9.8 శాతం వడ్డీకి అప్పుతీసుకున్నారని తెలిపారు.

అసలు తక్కువ వడ్డీకి ఇస్తే తప్పతీసుకోకూడదు అనుకున్నవాళ్ళు అధికవడ్డీకి ఎందుకు తీసుకున్నారని, కుటుంబరావు మీద నాకు ద్వేషం లేదని ఉండవల్లి చెప్పారు.

మామాట: మరి దీనిపై కుటుంబరావు రియాక్షన్ ఎలా ఉంటుందో?

Leave a Reply