పవన్ పెళ్లిళ్లపై జగన్ కామెంట్లు సరైనవి కావు….

Share Icons:

ఢిల్లీ, 25 జూలై:

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ పెళ్లిళ్లపై ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. ఈరోజు ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ…రాజకీయ నేతలుగా వ్యక్తిగతంగా విమర్శలు చేయడం సరైంది కాదని, పవన్ కళ్యాణ్‌కు ఎంతమంది భార్యాలుంటే… ఆ భార్యలే తేల్చుకోంటారని… ఇతరులు ఆ విషయంలో జోక్యం చేసుకోకూడదనేది చట్టం చెబుతోందని ఉండవల్లి చెప్పారు.

అవసరమైతే పవన్ కళ్యాణ్ మొదటి భార్య కోర్టుకు వెళ్లొచ్చని, వ్యక్తిగతంగా ఇలా విమర్శలు చేయడం తొలిసారిగా చూస్తునని అన్నారు.

గతంలో ఈ రకమైన విమర్శలు తాను ఎప్పుడూ కూడా వినలేదన్నారు. ఈ రకమైన వ్యక్తిగత విమర్శలు రాజకీయాలను కలుషితం చేస్తాయని, ఇవి రెండు పార్టీలకు ఆరోగ్యకరం కాదని ఉండవల్లి చెప్పారు. అయితే జగన్ పవన్ కళ్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలకు సంబంధించిన వీడియో తాను చూడలేదని, కానీ, ఈ విషయమై పత్రికల్లో వచ్చిన వార్తలను చదివానని అన్నారు.

మామాట: నిజమే..రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు ఉండకూడదు…

Leave a Reply