బయటకొచ్చిన ఉండవల్లి…హెచ్చరికలు జారీ…

Share Icons:

రాజమహేంద్రవరం: మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చాలరోజుల తర్వాత మీడియా ముందుకొచ్చారు. ప్రస్తుతం జగన్ ప్రభుత్వానికి చిన్నపాటి హెచ్చరికలు కూడా జారీ చేశారు.  151 సీట్లు వచ్చాయని..దానిని శాశ్వతంగా భావించవద్దని స్పష్టం చేసారు. అదే సమయంలో నవరత్నాల్లో ఏ మాత్రం తేడా వచ్చిన సొంత వారే తిరగబడతారని వ్యాఖ్యానించారు. ఏపీ చరిత్రలో ఎప్పుడు అత్యధిక మెజార్టీతో ఎవరు అధికారంలోకి వచ్చినా తిరుగుబాట్లు తప్పలేదని ఉండవల్లి గుర్తు చేసారు.

1972 లో కాంగ్రెస్ పార్టీ 51 శాతం సీట్లు సాధించి పీవీ నర్సింహారావు ముఖ్యమంత్రి అయ్యారని..ఆయన భూ సంస్కరణలకు తెర తీయగానే ఆయన పైన తిరుగుబాటు మొదలైందని ఉండవల్లి చెప్పుకొచ్చారు. అదే విధంగా 1994లో టీడీపీ అధినేత ఎన్టీఆర్ నాడు 294 సీట్లతో 213 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చారని..ఆ సమయంలో కాంగ్రెస్ కు 26 సీట్లు మాత్రమే వచ్చాయన్నారు. సరిగ్గా 9 నెలలకే ఊహించని విధంగా చంద్రబాబు తిరుగుబాటుతో ఎన్టీఆర్ పదవీచ్యుతుడయ్యారని వివరించారు.

ఇక ప్రజలతో పాటుగా సొంత పార్టీ ఎమ్మెల్యేల్లో సైతం ముఖ్యమంత్రి మీద మంచి అభిప్రాయం ఉండేలా..వారికి ప్రాధాన్యత ఇస్తున్నారనే భావన కలిగించేలా చూసుకోవాలని సూచించారు. ఎన్టీఆర్ మీద చంద్రబాబు తిరుగుబాటు చేస్తారని ఎవరైనా ఊహించారని అని ఉండవల్లి ప్రశ్నించారు. ఇక..విద్యుత్ ఛార్జీలు..ఇసుక కొరత పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఉండవల్లి వ్యాఖ్యానించారు. వాటి మీద ప్రభుత్వం మీద నెగటివ్ వచ్చిందని చెప్పారు.

అయితే ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టి ఇంకా ఆరు నెలలు కూడా పూర్తి కాలేదని..అయినా పాలన మీద వ్యతిరేక కామెంట్లు చేసే స్థాయిలో లేదని ఉండవల్లి చెప్పుకొచ్చారు. అదే సమయంలో రాష్ట్రంలో చంద్రబాబు హాయంలో విద్యుత్ కోతలు లేవని..ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత అమలవుతున్న విద్యుత్ కోతల మీద ప్రజల్లో వ్యతిరేకత ఉందని చెప్పారు. దీనికి గత పాలకుల వైఫల్యాలు కారణమని చెప్పినా ప్రజలు అంగీకరించన్నారు. ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. అదే విధంగా ఇసుక కొరత కారణంగా అనేక మంది కూలీలు ఉపాధి కోల్పోయారని..దీని మీద వ్యతిరేక కనిపిస్తోందని చెప్పుకొచ్చారు. దీనిని సైతం వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు.

Leave a Reply